28.7 C
Hyderabad
May 6, 2024 09: 42 AM
Slider ప్రత్యేకం

వానలు రాగానే అన్ని చెరువులు నింపాలి

#CM KCR Meeting

వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల చెరువులన్నింటినీ నింపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రాజెక్టుల కాల్వల నుంచి అవసరమైన తూములు (ఓటీలు), డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు.

అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్ గేజ్ లు ఏర్పాటు చేయాలని, నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రియల్ టైమ్ డాటా ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సిఎం చెప్పారు. ఎన్నో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ గొడుగు కిందికి రావాలని, ప్రాజెక్టుల భౌగోళిక స్థితిని బట్టి నీటి పారుదల శాఖను పునర్వ్యవస్ఠీకరించుకోవాలని సిఎం ఆదేశించారు.

నెలాఖరు కల్లా కాళేశ్వరం పంపులు పూర్తి కావాలి

ప్రతీ ప్రాజెక్టుకు నిర్వహణ (ఓ అండ్ ఎం) మాన్యువల్ రూపొందించాలని సిఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోని అన్ని పంపుల నిర్మాణం మే నెలాఖరు నాటికి పూర్తి చేసి, కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని పంప్ చేయాలని సిఎం ఆదేశించారు.

నీటి పారుదల శాఖకు చెందిన భూములు, కట్టల ఆక్రమణను తీవ్రంగా పరిగణించాలని సిఎం ఆదేశించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంబించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

మంత్రులు కె.టి.రామారావు, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ పాల్గొన్నారు.

ఇంకా సిఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఇఎన్ సీలు మురళీధర్ రావు, నాగేందర్ రావు, అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు, హరీరామ్, చీఫ్ ఇంజనీర్లు శంకర్, బంగారయ్య, మధుసూదన్ రావు, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

గోదావరి బేసిన్ లోని ప్రతీ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని, ఈ వానాకాలంలో ఎంత ఆయకట్టుకు నీరందించగలిగే విషయాలను సిఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు, సూచనలు చేశారు.

Related posts

పల్నాడు జిల్లా ఏర్పాటు ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే పాదయాత్ర

Satyam NEWS

పింఛన్‌ డబ్బులు పంచకుండా ప్రియురాలితో పరారైన వాలంటీర్‌

Satyam NEWS

రివర్స్:మాజీ ప్రియుని హత్య కేసులో 4 గురి అరెస్ట్

Satyam NEWS

Leave a Comment