40.2 C
Hyderabad
May 2, 2024 15: 44 PM
Slider ముఖ్యంశాలు

సీఎం చేతుల మీదుగా మెడికల్ కళాశాల ప్రారంభం

#medical college

ఈ నెల 15 న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కళాశాలను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించడం జరుగుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని మంత్రి ఛాంబర్ లో జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా ప్రజల ఆకాంక్ష వైద్య కళాశాల కల నెరవేరిందన్నారు.

ఈ నెల 15 న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 9 మెడికల్ కళాశాలలను ప్రారంభించుకుంటున్నామన్నారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేది కేవలం సీఎం కేసీఆర్ ఒక్కరేనని తెలిపారు. కామారెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాలతో పాటు 330 పడకల ఆసుపత్రి వచ్చిందన్నారు.

వచ్చే సంవత్సరం మరో 9 వైద్య కళాశాలలు మంజూరు ఇస్తే ప్రతి జిల్లాకో వైద్య కళాశాల ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో 20 కళాశాలలు ఉంటే ప్రస్తుతం 56 కళాశాలు ఉన్నాయని, ప్రభుత్వ వైద్య కళాశాలలు 5 ఉంటే ప్రస్తుతం 28 ఉన్నాయన్నారు. కళాశాలలు పెరగడం వలన పేద ప్రజలకు వైద్య సీట్లు వస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడైనా ప్రైవేట్ వైద్య కళాశాలలు పెరుగుతాయని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ వైద్య కళాశాలలు పెరుగుతున్నాయన్నారు.

రాష్ట్రంలో వైద్య విద్యార్థుల సీట్లు 3 రెట్లు పెరిగాయని, ప్రతి ఏటా 8,515 మంది వైద్య విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించవచ్చన్నారు. దేశంలో 3 శాతం మన రాష్ట్ర జనాభా ఉంటే వైద్య విద్యార్థుల ఉత్పత్తి 40 శాతం కు పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఉంటాయని, 15 శాతం ఆలిండియా విద్యార్థులకు ఉంటాయన్నారు.

లక్షకు పైగా ర్యాంకు వచ్చినా తెలంగాణ విద్యార్థులకు మన రాష్ట్రంలో వైద్య సీటు వస్తుందన్నారు. ఈ నెల 15న వైద్య కళాశాలల ప్రారంభోత్సవం గొప్ప పండుగ వాతావరణంలో జరిపేందుకు నిర్ణయించామని, 15, నుంచి 20 వేల మందితో గొప్పగా కృతజ్ఞత ర్యాలీ తీసేందుకు నిర్ణయించామని, ఈ ర్యాలీలో ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Related posts

ఒక్క రాజధానితోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం

Satyam NEWS

23న తిరుమల రానున్న ముఖ్యమంత్రి జగన్

Sub Editor

హీరో చిరంజీవికి కరోనా పాజిటివ్

Sub Editor

Leave a Comment