37.2 C
Hyderabad
May 6, 2024 12: 22 PM
Slider మహబూబ్ నగర్

కల్వకుర్తిలో కారు బేకారా ?

#TRS

కల్వకుర్తిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన కల్వకుర్తిలో కారు బేకారుగా, హస్తం అభయ హస్తముగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు తీర్పు చెప్పనున్నారా అనే ప్రశ్నలు రాజకీయ మేధావులు సంధిస్తున్నారు. అసెంబ్లీ బరిలో నిలిచేందుకు అధికారపార్టీ సొంత గూటి నుండే టికెట్ కోసం ఐదుగురు పోటీ పడడం టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు ఎవరికి వారు తమ వంతు కృషి చేయడం, అధిష్టానం ఆశీస్సుల కొరకు అధిష్టానానికి దాసోహం అంటూ గులాం గిరి చేస్తున్నారని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1989 ఎన్నికల్లో ఎన్టీ రామారావుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందడంతో ఈ నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా 1952 నుండి ఎన్నికలు నిర్వహించగా , కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళలకు రెండుసార్లు శాంతాబాయికి మాత్రమే టికెట్ ఇవ్వగా విజయం సాధించారు. కాగా ప్రస్తుతం ఏ పార్టీ నుండి మహిళలు బరిలో లేకపోవడం, ఏ పార్టీ మహిళలకు టికెట్ ఇవ్వకపోవడంతో మహిళా సంఘాలు అగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన ఆయన 2016లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి గత ఎన్నికల్లోనే టికెట్ ఖాయమని అనుకున్న ,అధిష్టానం పిలుపు మేరకు చర్చలు జరిపి కారు యజమాని నయాన్నో, భయాన్నో దారిలో పెట్టుకొని ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడిన ఆయన్ని తప్పించగా, శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన కూడా టికెట్ తమకే దక్కుతుందని ఆశతో ఉన్నట్లు పట్టణవాసులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

పార్టీ కోసం శక్తివంచన లేకుండా పని చేసిన తమకే కేసీఆర్ సుముఖంగా ఉన్నాడని ఏ పదవి లేకుండా పార్టీ మారకుండా ఉన్న ఉద్యమకారుడు కూడా కారు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అనుచర వర్గం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.తాతలు నేతిని తాగితే మనం మూతులు నాకినట్టుగా రాజకీయ వారసులుగా కారులో సీటును దక్కించుకోవాలని అనుచరుల బలగంతో వెనక ఉండి ముందుకు కారును తోయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుండడం పట్టణ ప్రజలు ముక్కున వేలు వేసుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యమ నేతగా పేరు తెచ్చుకున్న రాష్ట్ర సాధన అనంతరం కారులో సీటు కోసం విశ్వ ప్రయత్నం చేసిన ఫలించక అధిష్టానం బుజ్జగింపులతో పార్టీలోనే పక్క సీటుకు పరిమితమయ్యారు. రానున్న బరిలో టికెట్ ఆశిస్తున్నట్లు సొంత పార్టీలోనే ఐదుగురు పోటీ పడటంతో సిట్టింగ్ కే టికెట్ ఇవ్వనుందా అనే చర్చలు ఒకవైపు సిట్టింగ్ కే ఖాయమైందని ఓవైపు ఒకరికి ఒకరు ప్రశ్నలు సంధించుకుంటున్నారు.

మొత్తం మీద నాలుగు చక్రాల బండి బోల్తా కొట్టడం, టైర్ పంచర్ ఖాయమని, కారు ఐదుగురిని మోయలేక అధిక బరువుతో బ్రేక్ డౌన్ అవుతుందనేది జగమెరిగిన సత్యం గా కనిపిస్తుంది. నియోజకవర్గ ప్రజలు కారుపై సుముఖత లేదని నిరాశ, నిస్పృహ తోనే ఉన్నారని, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎటు వెళ్లిన నిరసన కుంపట్ల సెగతో బొగ్గలు వస్తున్నాయి. హస్తం గుర్తులో రెండు చేతులు పోటికి రావడం, ఇద్దరిలో అధిష్టానం ఎవరికీ అభయహస్తం ఇవ్వనుందో వేచి చూడాల్సి వస్తుందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఒక చేయి నియోజకవర్గమంతా ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తున్నారని, ఒక చేయి దేశ రాజధాని లోనే శిష్ట వేసుకొని కూర్చుందని రెండు చేతులు దరువులేస్తున్నాయి. ఒక చేయి దేశ రాజకీయంలో చక్రం తిప్పాలని తమ హోమ్ మినిస్టర్ చే నియోజకవర్గం లో చక్రం తిప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.మూడుమార్లు విజయ డంకా మోగించాలని పువ్వు వికసించాలని విశ్వ ప్రయత్నాలు చేసినా రసవత్తరమైన రాజకీయ కుళ్ళు, కుతంత్రాలతో పువ్వు వికసించలేక ప్రత్యర్థి బరిలో నిలిచిపోయింది.

రానున్న భరిలో పువ్వు వికసిస్తుందా లేదా చూడాలి.ఎమ్మెల్యే సీటు కొరకు ఏదో ఓ పార్టీ నుండి టికెట్ వస్తుందని ఆశించి పలు సేవా కార్యక్రమాల్లో ముందుండి భారీగా ఖర్చుపెట్టి విశ్వ ప్రయత్నాలు చేసిన ఏ పార్టీ హక్కున చేర్చుకోలేకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆయన మరి సొంతంగా బరిలో దిగుతారా దిగరా అనేది ప్రశ్నార్థకం.మొత్తం మీద రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించిన కల్వకుర్తి నియోజకవర్గం లో కారు బోల్తా కొట్టడం హస్తం అభయ హస్తం కావడం ఖాయమని నియోజకవర్గం రాజకీయం ఎవరికి అంతుచిక్కని స్థాయిలో విలక్షణ తీర్పు ఇస్తుందనే చర్చలు జరుగుతున్నాయి.

పోల శ్రీధర్, సత్యంన్యూస్.నెట్, కల్వకుర్తి

Related posts

విజయనగరం డీపీఆర్వో రమేష్ కి ఏడి గా పదోన్నతి…!

Satyam NEWS

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా

Satyam NEWS

మూడు రోజులపాటు పశ్చిమ గోదావరి లో బాబు పర్యటన

Murali Krishna

Leave a Comment