29.7 C
Hyderabad
May 4, 2024 06: 45 AM
Slider గుంటూరు

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా

#electricity

స్థానిక వాసవి కళ్యాణ మండపం లో పల్నాడుజిల్లా  నర్సరావుపేట డివిజన్ పరిధి లో ఉన్న సబ్ డివిజన్ రెవిన్యూ అధికారులతో  డి. సుబ్బారావు చీఫ్ జనరల్ మేనేజర్ ఆపరేషన్ మరియు మెయింటే నన్స్ ఏపీసీపీడీసీల్ విజయవాడ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్ష లో విద్యుత్ ఆపరేషన్ మరియు మేటైనన్స్ కి సంబందించిన అన్ని అంశాలపై  అధికారులు, సిబ్బంది తో  సమీక్ష జరిపారు. డివిజన్ పరిధిలో ఎలక్ట్రికల్ ప్రమాదాలు వాటి నివారణకు చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అని సమీక్ష జరిపారు.

విద్యుత్ వాడకం దారుల పట్ల ప్రతి ఒక్క ఉద్యోగి జవాబుదారి తనంగా ఉండాలి అని, కార్యాలయం కి వచ్చిన వినియోగదారుని పట్ల మంచి ధోరణి తో మెలగాలి అని సిబ్బందికి  దశ నిర్దేశం చేశారు. విద్యుత్ వాడకం దారులకు అంతరాయము లేకుండా విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది అని, మూడు జిల్లా ల లో అనేక నూతన విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాటు చేసాము అని పేర్కొన్నారు. ప్రతి ఒక్క విద్యుత్ వాడకం దారుడు బకాయిలు లేకుండా బిల్లు లు చెల్లింపులు చేయాలి అని కోరారు.

యస్. సి మరియు యస్ టి ల  విద్యుత్ వాడకం  దారులకు రెండు వందల యూనిట్స్ వరకు జగజ్జీ వన్ జ్యోతి యోజన క్రింద  ప్రభుత్వ సబ్సిడీ ద్వారానే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఈ  సమీక్ష సమావేశం లో గుంటూరు జిల్లా సీనియర్ అకౌంట్స్ అధికారి కె. సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు, ట్రాన్స్ఫార్మర్,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యస్. శ్రీనివాసరావు, వినుకొండ, సత్తెనపల్లి, నర్సరావుపేట పట్టణ, రూరల్  సబ్ డివిజన్ అధికారులు వారి సిబ్బంది, ఎ. ఎ. ఓ నర్సరావుపేట పి. శ్రీ దీప్తి తదితరులు పాల్గొన్నారు.

Related posts

New Wave: గురజాడ “ప్రకాశిక” మళ్ళీ వెలుగులోకి

Satyam NEWS

దయనీయ స్థితిలో ఉన్న ముగ్గుర్ని ఆదుకున్న మానవ హక్కుల కమిషన్

Satyam NEWS

టీఆర్ఎస్ కు ప్రమాదఘంటికలు మోగించిన పోస్టల్ బ్యాలెట్

Satyam NEWS

Leave a Comment