Slider ప్రత్యేకం

కుల, మత సామరస్యానికి ప్రతీక బిఆర్ యస్

#brsparty

తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమం తెరాస ప్రభుత్వం లక్ష్యంగా పని చేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లిం కుటుంబాలకు అందిస్తున్న రంజాన్ తోఫా లను మంత్రి పువ్వాడ స్వయంగా పంపిణీ చేశారు. ఖమ్మం నగరంలోని 42వ డివిజన్ నిజాంపేట, 40వ డివిజన్ శుక్రవారపేట, 39వ డివిజన్ మెదరి బాజర్, 38వ డివిజన్ ఖిల్లా, 37వ డివిజన్ కస్బా బజార్ మాజిద్ లలో ఆయా తొఫా లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మత సామరస్యానికి ప్రతీకగా తెరాస ప్రభుత్వం పండగలకు ప్రాధాన్యమిస్తూ ఆయా వర్గాల ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఏడాది 5వేలు పంపిణీ చేస్తుండగా, కానీ ఈసారి ముఖ్యమంత్రి కేసీయార్ కి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి ఈసారి మరో 1700 వందల గిఫ్ట్ ప్యాక్స్ ను తెచ్చుకుని మొత్తం 6700 కిట్స్ ను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.

వీటితో పాటు పువ్వాడ ఫౌండేషన్ తరుపున 6700 సేమియా కిట్స్ ను కూడా పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ రంజాన్ గిఫ్ట్ ప్యాక్ లో చీర, బ్లౌజ్, పంజాబి డ్రెస్ మెటీరియల్, లాల్చీ, పైజమా క్లాత్ ఉంటుందన్నారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వం హిందువులకు బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ, క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు, ముస్లింలకు రంజాన్ పండుగను పురస్కరించుకుని పేద ప్రజానీకానికి రంజాన్ కానుక అందించడం జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మత సామరస్యానికి ప్రతీకగా నిలిపె లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పండగలు అనేవి సంతోషంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అన్నారు. అయితే పండుగల వేళ నిరుపేద ప్రజానీకం నూతన వస్త్రాలు తెచ్చుకునే పరిస్థితి లేకపోవడం గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా వర్గాల ప్రజలకు పండగ వేళ బట్టల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

ఈ పండుగను సోదరభావంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాల మధ్య కుటుంబ సమేతంగా జరుపుకోవాలని మంత్రి పువ్వాడ ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర, చైర్మన్ శ్వేత, కార్పొరేటర్లు పాకాలపాటి విజయనిర్మల, మడురి ప్రసాద్, దాదే ఆమృతమ్మ, ఆలియ షౌకత్ అలీ, తహసిల్దార్ శైలజ, నాయకులు తాజ్ఉద్దీన్ ఖమర్, ముక్తార్, సలీం, ముజాహిద్, తౌసిఫ్, షంశుద్దిన్, మడురి సైదారావు, మెహబూబ్ అలీ, శేషగిరిరావు, దాదే సతీష్ తదితరులు ఉన్నారు.

Related posts

Good News: టిక్ టాక్ ను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మృతి

Satyam NEWS

బాలలు దేశంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలి

Satyam NEWS

Leave a Comment