29.7 C
Hyderabad
May 3, 2024 04: 47 AM
Slider ముఖ్యంశాలు

ప్రీతీ మరణానికి సంతాపం తెలియజేస్తూ క్యాండిల్ ర్యాలీ

#preeti

సీనియర్ సైఫ్ వేధింపులు తాళలేక అసులుబాసిన ప్రీతి మరణానికి సంతాపం తెలియజేస్తూ బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.మంగళవారం ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ లోని ఎన్.టి.ఆర్ నగర్ శక్తి కేంద్ర ఇంఛార్జి రాజు ఆధ్వర్యంలో   బూత్ నంబర్ 461,462,463, 464 లకు  సంబంధించిన శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ కు  బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సీనియర్ సైఫ్ వేధింపులు తాళలేక అసువులు బాసిన ఎస్.టి మెడికో విద్యార్థినీ ప్రీతి నాయక్ మరణానికి సంతాపం వ్యక్తపరుస్తూ క్యాండీల్  ర్యాలీని నిర్వహించి సంతాపం తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  నియోజకవర్గంలో బిక్షపతి యాదవ్ హాయంలోనే ఎల్లమ్మ బండ , ఎన్.టి.ఆర్ నగర్ , మహంకాళి నగర్ , ఇలా అన్ని కాలనీ లలో  ఇళ్ళ పట్టాలు , ఇందిరమ్మ ఇళ్లు ,   సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం,  మంజీరా వాటర్ లైన్లు  అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేశామని అన్నారు.

బి.ఆర్.ఎస్ నాయకులు సుందరీకరణ పేరుతో చెరువులను కబ్జాలకు పాల్పడటం, ఎవరైనా బిల్డింగ్ లు కట్టుకుంటుంటే డబ్బులు వసూలు చేయడం  తప్ప వారు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. 55000 అప్లికేషన్స్ వస్తే , డబుల్ బెడ్ ఇండ్ల ని కట్టింది 344 అని ఎద్దేవా చేశారు.ఒక్క ఇంటినైనా అర్హులైన లబ్ధదారులకు ఇచ్చారా అని ప్రశ్నించారు,  నిరుద్యోగ భృతి ,కేజీ టు పిజి ఉచిత విద్య , జిల్లా కో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ,బీసీ,ఎస్.సి ,గిరిజనులకు రిజర్వేషన్లు , ఇలా ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు, 

బడుగు బలహీన వర్గాలకు వారి అభ్యున్నతి  కోసం ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చి , భారత దేశాన్ని శక్తి వంతమైన దేశం తీర్చిదిద్దుతుంది కేవలం కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని తెలియజేశారు ,ప్రతి కార్యకర్త బూత్ లో ప్రతి ఇంటికి వెళ్ళి కేసిఆర్ అవినీతిని తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామరాజు, విజ్జిత్, నరేందర్ రెడ్డి, కుమార్ యాదవ్, మనిభుషన్, కమలాకర్ రెడ్డి, నర్సింగ్ యాదవ్, చారి ,అనిత , కల్పన, రామ్ మోహన్, సీతా రామరాజు,శ్రీహరి యాదవ్, శివాజీ, రాజు, శ్రీకాంత్ , విష్ణు, స్థానిక నాయకులు,కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోవిడ్ -19 టీకా డ్రై రన్ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యుడు సైదిరెడ్డి

Satyam NEWS

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

Satyam NEWS

శ్రీనగర్‌లో భద్రతాబలగాలపై మళ్లీ ఉగ్రదాడి

Satyam NEWS

Leave a Comment