Slider మహబూబ్ నగర్

కృష్ణ నదిలో ప్రయాణించిన వారిపై కేసు నమోదు

Manchalakatta

పోలీసులు ఎన్ని రకాలుగా హెచ్చరికలు జారీ చేసినా ప్రజలు మారడం లేదు. అందుకే పెంట్ల వెల్లి ఎసై ఎం.శ్రీనివాసులు పోలీస్ శాఖ పద్ధతిలో కొందరికి  ట్రీట్మెంట్ ఇచ్చారు. శనివారం పెంట్ల వెల్లి మండల ప్రాంతంలోని మంచాలకట్ట గ్రామానికి చెందిన భార్యాభర్తలు, మరి కొందరు కృష్ణా నది తీరం గుండా పుట్టిలో ప్రయాణం చేశారు.

లాక్ డౌన్ ఆంక్షల ప్రకారం ఇలా చేయకూడదు. దాందో  బోటు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం శ్రీనివాసులు తెలిపారు. ఎసై తెలిపిన  వివరాలు ఇలా ఉన్నాయి.

మంచాల కట్ట గ్రామానికి చెందిన భార్య భర్తలు కృష్ణా నది గుండా పుట్టి లో ప్రయాణం చేసి చేపల వేటకు వెళ్లారు. అయితే రాయలసీమ సరిహద్దులో పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన  నలుగురుని   మంచాలకట్ట   గ్రామానికి తీసుకు వచ్చారు. విషయం తెలుసుకోవడంతో అక్కడికి చేరుకొని వెంటనే  వాళ్లను అదుపులోకి తీసుకున్నామన్నారు.

 ఇదివరకు హెచ్చరికలు జారీ చేసినా  వినిపించుకోకుండా వ్యవహరించి నందుకు  ఆరుగురి పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పుట్టిని సీజ్ చేసి  పోలీస్ స్టేషన్ కు తరలించమన్నారు. ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి నుండి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇకపై ఎవరైనా ఆదేశాలను పాటించకుండా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం అదేశించే వరకు నది తీరం వైపు వెళ్లినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశిల గ్రామ ప్రాంతాలలో పోలీస్ లు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రజలు తస్మాత్ జాగ్రత్త

Related posts

తిరుమలలో సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు

Satyam NEWS

పేదల కోసం కృషి చేసిన పాపన్న

Bhavani

ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు

Murali Krishna

Leave a Comment