27.7 C
Hyderabad
May 4, 2024 10: 48 AM
Slider కడప

ఢిల్లీ నుంచి కడప వచ్చిన సీబీఐ డీఐజీ

cbi-1

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మరింత దూకుడు పెంచేందుకు చర్యలు చేపట్టారు. వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో ఢిల్లీ నుంచి సీబీఐ డీఐజీ చౌరాసియా కడపకు వచ్చారు.

కడపలో సీబీఐ అధికారులతో ఆయన సమావేశమై కేసు పురోగతి పైన చర్చించినట్లు సమాచారం. సీబీఐ వివేకా హత్య కేసులో ఇప్పటికే రెండు చార్జీషీట్లు కోర్టులో వేయడంతోపాటు ఐదుగురిని నిందితులుగా చేర్చింది. మరికొందరి ప్రమేయం పైన ప్రస్తావించిన తరుణంలో త్వరలో అరెస్టు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో సీబీఐ అధికారి కడప కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ ఉన్నతాధికారి వారం రోజులపాటు జిల్లాలోనే ఉండి కేసు పురోగతిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts

రోడ్ సేఫ్టీ మీటింగ్: ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి…!

Bhavani

33 ఏళ్లుగా కేసు: ఒకే ఒక్క రోజు జైలు శిక్ష

Satyam NEWS

జయహో జనయిత్రి

Satyam NEWS

Leave a Comment