తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు ఇంటిపై సీబీఐ దాడులు జరిగాయి. ఉదయం నుంచి రాయపాటి ఇల్లు, ఆఫీస్ లో సోదాలు కొనసాగుతున్నాయి. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ తో పాటు పలు కంపెనీల్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఢిల్లీలోకూడా ఏకకాలంలో సీబీఐ సోదాలు కొనసాగడం గమనార్హం. బ్యాంకు నుంచి రుణం గా తీసుకున్న రాయపాటి కంపెనీ తిరిగి చెల్లించలేదు. ఆ మొత్తం సుమారు 300 కోట్ల రూపాయలు మేరకు ఉన్నట్లు తెలిసింది. రాయపాటి కంపెనీ పై కేసు నమోదు చేశారు.
రాయపాటి ఇల్లు, కంపెనీలతోపాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సీఈవో ఇళ్లపై సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఈ సోదాల సందర్భంగా పలు కీలక డాక్యూమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.