23.2 C
Hyderabad
May 7, 2024 19: 45 PM
Slider హైదరాబాద్

ఆంధ్రా కేడర్ ఐపీఎస్ కు తెలంగాణాలో ఏం పని?

gandhi bhavan

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అధికార టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు తొత్తుగా వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రా కేడర్ కు చెందిన ఈ ఐపీఎస్ అధికారికి తెలంగాణ రాష్ట్రంలో ఏం పని అంటూ ప్రశ్నించారు.

 ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మారి పోయారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రజల కోసమే పని చేస్తోంది తప్ప తమ పార్టీ తీవ్రవాద సంస్థ కాదని ఆయన అన్నారు. సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆర్ ఎస్ ఎస్ మార్చ్ కు, ఎంఐఎం పబ్లిక్ మీటింగ్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారని శ్రవణ్ నిలదీశారు.

వీరికి అనుమతి ఇచ్చిన సీపీ, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అనుమతి రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారని ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన అన్నారు. శాంతియుత ర్యాలీకి సీపీ పర్మిషన్ ఇవ్వక పోవడంతో గాంధీ భవన్ లోనే సత్యాగ్రహ దీక్షను చేపట్టామన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతల పట్ల సీపీ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.  

మంత్రి తలసాని తల తోక లేకుండా మాట్లాడుతున్నారని, ఉత్తమ్ పై కామెంట్స్ చేసే స్థాయికి ఇంకా తలసాని ఎదగలేదన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నిబద్దత కలిగిన పైలట్ గా పని చేసిన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి దన్నారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి ఉద్యోగాన్ని నిర్వహించారని, మరి తలసాని ఏం చేశారో చెప్పాలన్నారు. తలసాని పదవి కోసం పార్టీ మారారు. అంతే కాదు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేశారు. ఆయనకు మాట్లాడే హక్కు లేదన్నారు శ్రవణ్. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ ను అనరాని మాటలను అనలేదా అని ప్రశ్నించారు.

ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మాట్లాడిన తీరు పై స్పందించారు. నిబద్దతతో పని చేసిన ఐపీఎస్ లు ఉన్నారు. వారిని తమ పార్టీ అనడం లేదు. తల మీద టోపీ ధరించడం అంటే ఆడో గొప్ప గౌరవంగా భావించాలి. కానీ ప్రస్తుతం తెలంగాణాలో ఐపీఎస్ లు, ఐఏఎస్ లు ఎస్ బాస్ అంటూ ఉన్నారని ఆరోపించారు.

కింది స్థాయి కాన్స్టిబుల్ నుంచి ఎసై, సీఐ, డిఎస్పీ లదాకా టిఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన వారికే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. మరి దీనికి పోలీస్ బాస్ ఏం సమాధానం చెబుతారని అన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ర్యాలీ ని ఎందుకు అనుమతి ఇవ్వలేదో బేషరతుగా ప్రజలకు చెప్పాలన్నారు. ఈ సమావేశంలో అంజాన్ కుమార్ యాదవ్, ప్రేమ్ లాల్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

దౌర్జన్యంతో గెలవాలని చూస్తున్న వైసీపీ

Bhavani

బీజేపీ, జేడీస్ మధ్య పొత్తు

Bhavani

చైనా, పాకిస్తాన్ కు తప్ప అన్ని దేశాలకూ కరోనా వ్యాక్సిన్

Satyam NEWS

Leave a Comment