34.2 C
Hyderabad
May 13, 2024 17: 09 PM
Slider కడప

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల పేరిట సైబర్ మోసాలు

YSR District SP K.K.N Anburajan

సైబర్ నేరగాళ్లు కొత్త ఆలోచనలతో ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వై ఎస్ ఆర్ జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ సూచించారు. మీకు ఇన్సూరెన్స్ ఉందని, మీకు రూ. కొన్ని లక్షలు డబ్బులు వస్తాయని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ల పేరుతో ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన ఒక ప్రకటన లో తెలిపారు. ప్రాసెసింగ్ చార్జీలు, జిఎస్టీ, ఇతర ఛార్జిల పేరుతో రూ. లక్షలు నగదు ట్రాన్స్ ఫర్ చేయించుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ఎస్పీ తెలిపారు.


మీ ఇన్సూరెన్సు మెచ్యూరిటీ అయింది అని మీకు ఫోన్ వచ్చిందా? అయితే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే ప్రమాదం ఉంది. మోసం చేస్తారిలా….సైబర్ నేరగాడు ఒక వ్యక్తి కి ఫోన్ చేసి తాము ప్రముఖ ఇన్సూరెన్సు కంపెనీ నుండి ఫోన్ చేస్తున్నాం, ఇటీవల కాలంలో మీ పేరు పైన మా కంపెనీ బీమా పాలసీ ఉంది. మెచూరిటీ గడువు ముగిసింది..మీకు కొన్ని లక్షల రూపాయలు వస్తాయి అని,,,వాటిని మీరు క్లెయిమ్ చేసుకోండి. అందుకు మేము ఎలాంటి ఇన్సూరెన్స్ కట్టలేదు.. అని సమాధానం చెప్పినా సైబర్ మోసగాళ్లు చాకచక్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇన్సూరెన్స్ ఉందంటూ మాయమాటలతో మభ్యపెట్టి మీ కుటుంబ సభ్యుల అందరిపేరుతో కలిపి మళ్ళీ క్రొత్తగా ఒక పాలసీ తీసుకోవాలని చెప్పి అదే విధంగా మీ కుటుంబ సభ్యుల పేరుతో మరో పాలసీ తీసుకోవాలంటూ చెబుతారు.


తరువాత సైబర్ నేరగాడు కొన్ని లక్షల రూపాయలు మీ అకౌంటు లో జమచేయాలి అంటే ప్రాసెసింగ్ ఫీజు, GST , ఇతర చార్జీల పేరుతో కొన్ని వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయాలని అని ఆ వ్యక్తి కి ఫోన్ లో తెలుపుతాడు. ఇది నిజం అని నమ్మి సదరు వ్యక్తి ఆ సైబర్ నేరగాడి అకౌంట్ కి పలు దఫాలుగా రూ.లక్షల్లో ట్రాన్సఫర్ చేస్తారు. ట్రాన్సఫర్ చేసిన తరువాత ఆ సైబర్ నేరగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయగా తాను మోస పోయానని గ్రహిస్తారు.


ప్రజలు ఇటువంటి సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలి. మీకు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీకు ఇన్సురెన్సు వస్తుంది అంటే నమ్మకండి …. మీ బ్యాంక్ ఖాతా వివరాలు , పాన్ కార్డు , ఆధార్ కార్డు వివరాలు మీకు తెలియని వారికి పంపకండి. ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో కానీ లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ తెలిపారు.

Related posts

ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు:… అయితే క్షేమం

Satyam NEWS

మృతుని కుటుంబ సభ్యులకు పరామర్శ: 25 కేజీల బియ్యం అందజేత

Satyam NEWS

ఫ్లయింగ్ క్రైమ్: మహిళల్ని గల్ఫ్ దేశాలకు పంపుతున్న ఇద్దరి అరెస్టు

Satyam NEWS

Leave a Comment