29.7 C
Hyderabad
May 3, 2024 05: 57 AM
Slider వరంగల్

భారీ వర్ష బాధితులకు సిబిఐటి విద్యార్ధుల సాయం

#cbit

గత వారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం మోరంచపల్లిలో వర్షాలు ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేశాయి. మోరంచవాగు పొంగడంతో గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది. ఏకంగా ఊరు మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. వరద ఉధృతితో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిబిఐటి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అధ్యాపకుల సహాయంతో తమ వంతుగా సుమారు 600 కేజీల బియ్యం, పప్పు దినుసులు ఈ రోజు మోరంచపల్లి గ్రామస్తులకు ఆందజేశారు.  ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి వి నరసింహం మాట్లాడుతూ విద్యార్థులకు వారి నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల వారికి బాధ్యత పెరుగుతుంది అని చెప్పారు. ఎన్ఎస్ఎస్ ఫాకల్టీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎమ్ గణేష్ రావు  మాట్లాడుతూ సిబిఐటి , ఎన్ఎస్ఎస్ విద్యార్థులు  ఎంతో బాధ్యత గా ఈ కార్యక్రమం నిర్వహించారు అని చెప్పారు.

Related posts

అమరావతి భూ కుంభకోణంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీం విచారణ

Satyam NEWS

కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం

Satyam NEWS

విధి నిర్వహణలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment