40.2 C
Hyderabad
April 29, 2024 18: 18 PM
Slider గుంటూరు

సీఎం జగన్ రాజీనామా చేయాలి

#balakotaiah

దాదాపు 50వేల మంది నిరుపేదలను ఇళ్ళ స్థలాల పేరుతో నమ్మించి, మోసం చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి, హైకోర్టు తీర్పును గౌరవించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటిదాకా హైకోర్టు, సుప్రీం కోర్టులు నూటొక్క చెంప దెబ్బలు కొట్టినా ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని, ఎన్నికల నేపథ్యంలోనైనా క్యాబినెట్ ని రద్దు చేసుకొని ముఖ్యమంత్రి ఎన్నికలకు వెళ్లాలని ఆయన సూచించారు.సిఆర్డీఎ నిబంధనలను కాలదన్ని, ఫాం 9.14 ఒప్పందాలను తుంగలో తొక్కి, కేవలం ఓట్ల కోసం ఆర్ 5 జోన్ సృష్టించారని ఆరోపించారు.

ఆర్ 3 జోన్ లో పేదలకు నివేశనా స్థలాలు ఇచ్చే అవకాశం ఉన్నా, కేవలం రాజధానిపై పగతో, కక్షతో తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. న్యాయస్థానాలలో తుది తీర్పు రాకుండానే పంతం పట్టి పట్టాల పంపిణీ, భూమి పూజ వంటి కార్యక్రమాలను చేపట్టారని , 1300 కోట్లు మట్టి పాలు చేశారని పేర్కొన్నారు. సుప్రీం కోర్టుకు వెళ్లి సాధించినట్లు, అమరావతి లో సామాజిక సమతుల్యత వంటి పెద్ద పెద్ద అబద్ధాలను ప్రచారం చేశారని పేర్కొన్నారు. రాజధాని గ్రామాల్లో వేలాది మంది పోలీసులను దింపి మహిళల గొంతులను అణచి వేశారని ఆరోపించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వంచించిన నిరుపేదలకు సెంటు పట్టాలు ఎక్కడ ఇస్తారని ప్రశ్నించారు. ఇడుపులపాయ ఎస్టేట్ లోనా, లోటస్ పాండ్ లోనా, బెంగుళూరు ప్యాలెస్ లోనా అంటూ చమత్కరించారు. వెంటనే పేదలకు వారి వారి నివాస ప్రాంతాల్లోనే ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చేసిన మోసాన్ని నిగ్గదీయాలని నివేశనా స్థలాల లబ్ధిదారులకు పిలుపు నిచ్చారు.

Related posts

అసోం పోలీసులు నిరసనకారుల మధ్య ఘర్షణ: ఉద్రిక్తత

Sub Editor

కేంద్ర రైల్వే మంత్రితో ఎంపీ రవిచంద్ర భేటీ

Bhavani

కూలీలకు, చేతి వృత్తిదారులకు నెలకు పది వేలు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment