29.7 C
Hyderabad
April 29, 2024 08: 52 AM
Slider కరీంనగర్

కాంగ్రెస్, బిజెపిల చీకటి ఒప్పందం: మంత్రి కొప్పుల

#BJP

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మిరెడ్డి పల్లె గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 20 లక్షల తో నిర్మించే గ్రామ సచివాలయం (గ్రామ పంచాయతి) నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి, అనంతరం గ్రామంలో 5 లక్షల

తో సామాజిక భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, మహిళ భవనం, పూర్తి చేయడం జరుగుతుందని, పంచాయతి భవనం

కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగిందని, మహిళ సంఘ భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధులు కేటాయించామని అన్నారు. ఈ భవనాన్ని అతి త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. కాంగ్రెస్, బిజెపిల చీకటి

ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇది హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లోను రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం ప్రజలకు అందరికీ తెలిసిందే అని మంత్రి ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్, బిజెపి పార్టీ లకు చౌక బారు

ఆరోపణలు చేయడం అలవాటు మొదటి నుంచి ఉందన్నారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం గా నిలుస్తుందని, ముందు చూపు ఉన్న, ఒక విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు

బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పై చేస్తున్న ఆరోపణలు అర్ధం లేనివని అన్నారు. దేశం లోనే అజేయమైన శక్తి గా ఎదుగుతున్న పార్టీ బిఆర్ఎస్ అని, దేశం పై కేసీఆర్ మార్క్ ఉండటం తో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లను ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారని, ఈ పార్టీలు దేశంలో అధికారంలో ఉన్న

రాష్ట్రాల్లో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని మంత్రి అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో బీజేపీ కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాక్ అయిందని, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని, మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఉంటారని మంత్రి అన్నారు.

Related posts

మున్నేరు వరద బాధితులకు గృహ వినియోగ వస్తువులు పంపిణి

Bhavani

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని కలిసి ఛాంబర్ ఆఫ్ కామర్స్

Satyam NEWS

అమరావతిలో సుజనా చౌదరి భూములు ఇవి

Satyam NEWS

Leave a Comment