నిర్మల్ జిల్లా యస్.పి సి.శశిధర్ రాజు ఆదేశానుసారం కోర్టు వర్తికల్ అధికారులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ డి.సి.ఆర్.బి మాట్లాడుతూ ICJS అప్లికేషన్ లో నాణ్యమైన డాటాను నమోదు చేయాలని, డాటా సరిగా నమోదు కాని కేసుల చార్జీ షీట్ లు కోర్టు నుండి పునః పరిశీలనకు తిరిగి పోలీస్ స్టేషన్ కు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
కొన్ని కేసులలో అలా జరిగే అవకాశం ఉందని, ICJS అప్లికేషన్ ద్వారా కోర్టుకు పంపే చార్జీ షీట్ లను పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం పంపాలని ఆయన కోరారు. నాన్ బైలబుల్ వారెంట్ లు జారీ అయిన నేరస్తులను త్వరగా పట్టుకుని న్యాయ స్థానంలో ప్రవేశ పెట్టాలని ఆయన కోరారు.
ICJS అప్లికేషన్ లో నాణ్యమైన డాటాను నమోదు చేసే ప్రక్రియను ఏ విధంగా చేయాలో ఐ.టి. కోర్ టీమ్ ఇంచార్జీ షేక్ మురాద్ అలీ తెలిపారు. ఈ కార్యక్రమంలో DCRB SI పోశేట్టి, లైజన్ ఆఫీసర్ సక్రియా నాయక్ అన్ని పోలీస్ స్టేషన్ ల కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.