37.2 C
Hyderabad
May 2, 2024 12: 48 PM
Slider ప్రత్యేకం

కన్నుల పండువగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం ముగింపు

#paiditalliammavaru

విజ‌య‌న‌గ‌రం శ్రీశ్రీశ్రీ  పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం  కన్నుల పండువగా  న‌గ‌ర మ‌ధ్య ఉన్న పురాత‌న పెద్ద చెరువులో మూడు సార్లు తిరగ‌డంతో వైభ‌వోపేతంగా ముగిసింది.సాయంత్రం సంధ్య వేల‌లో వ‌నంగుడివ‌ద్ద అమ్మ‌వారుకు  ప్ర‌త్యేక పూజ‌లు నిర్విహించారు…దేవస్థాన ఆల‌య అర్చ‌కులు.ఈఓ కిషోర్ కుమార్ స‌మ‌క్షంలో వ‌నంగుడి వ‌ద్ద నుంచీ మేళ‌తాళాల‌తో  అమ్మ‌వారిని ఊరేగింపుగా పెద్ద చెరువు వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు. చెరువులో సిద్దంగా ఉన్న హంస‌వాహ‌నంపై ఆల‌య పూజారి అమ్మ‌వారి విగ్ర‌హాన్ని తీసుకువ‌చ్చి అందులో అధిష్టింప చేసారు. హంస‌వాహ‌నంపై అమ్మ‌వారు సాయం సంద్య‌లో వేళ‌లో నీటిలో విహ‌రించారు.రెవిన్యూ,మున్సిపాలిటీ,పోలీస్ ,దేవాదాయ శాఖ సిబ్బంది ఆద్వ‌ర్యంలో పైడితల్లి అమ్మ‌వారు హంస‌వాహ‌నంలో విహ‌రించారు.

శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి తెప్పొత్స‌వం విశేషాలు.

*విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వాహన పడవపై, అమ్మవారి ఊరేగంపు.

* పైడిత‌ల్లి జ‌న్మించిన పెదచెరువులో మూడుసార్లు ఊరేగింపు.

*అగ్ని మాప‌క‌,పోలీస్,రెవిన్యూ అధికారుల స‌మ‌క్షంలో తెప్పొత్సవం.

*స‌రిగ్గా సాయంకాలం 05.29 నిమిషాల‌కు తెప్పొత్స‌వం ప్రారంభం.

* 06.20 నిమిషాల‌కు చెరువులో తెప్పొత్స‌వం పూర్తి.

*కోనాడ నుంచీ గ‌జఈత‌గాళ్ల‌ను తెచ్చి ఉంచిన రెవిన్యూ  శాఖ‌.

*రూర‌ల్ సీఐ మంగేణి స‌మ‌క్షంలో ఎస్ఐలు నారాయ‌ణ‌,ప్ర‌సాద్,సూర్యనారాయ‌ణ‌ల‌తో బందోబ‌స్తు.

*అగ్నిమాప‌క శాఖ రేంజ్ అధికారి ఆధ్వ‌ర్యంలో ఫైర్ సేప్టీ సిబ్బంది విధులు.

*జే.సీ కిషోర్ కుమార్, విజ‌య‌న‌గ‌రం ఎమ్మార్వో ప్ర‌భాక‌ర్ ఆధ్వ‌ర్యంలో ఉత్స‌వం.

*మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మీ,డిప్యూటీ మేయ‌ర్ శ్రావ‌ణిలు హాజ‌రు.

* అమ్మ‌వారి హంస‌వాహ‌నంతో పాటు రెండు మిష‌న్ బోట్లు,రెండు చేతి బోట్లు.

*ప్ర‌త్యేక బోటు లో తెప్పొత్స‌వాన్ని తిల‌కించి ,తీసిన మీడియా ప్ర‌తినిధులు.

*మ‌త్స్య శాఖ డీడీ నిర్మ‌లాకుమారీ ఆధ్వ‌ర్యంలో 30 మంది గ‌జఈత‌గాళ్లు.

అమ్మ ఆశీస్సుల‌తోనే తెప్పొత్స‌వం  ప్ర‌శాంతంగా ముగిసింది.-జే.సీ కిషోర్ కుమార్

విజ‌య‌న‌గ‌రం శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆశీస్సుల‌తోనే అమ్మ‌వారి తెప్పొత్స‌వం ప్ర‌శాంతంగా,సజావుగా అనుకున్న స‌మ‌యానికి పూర్తి అయింద‌న్నారు…జిల్లా జాయంట్ క‌లెక్ట‌ర్ కిషోర్ కుమార్. తెప్పొత్స‌వం ముగిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు.రెవిన్యూ,పోలీస్,మున్సిపాలిటీ,దేవాదాయ శాఖలు క‌లిసి సంయుక్తంగా అమ్మవారి తెప్పొత్స‌వాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసాయ‌ని జేసీ తెలిపారు.

Related posts

ఎక్కువ పాల కోసం మల్టీ మినరల్ పిండి పదార్ధాలు వాడండి

Satyam NEWS

దేశంలోని మహిళలకు పెద్దన్నలా నిలిచిన నరేంద్రమోడీ

Satyam NEWS

దేశంలోనే తొలి “సైకోమెట్రిక్ విద్య” రాష్ట్రంగా తెలంగాణ

Satyam NEWS

Leave a Comment