37.2 C
Hyderabad
May 6, 2024 13: 21 PM
Slider నిజామాబాద్

సిసి రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీడీవో

CC Road

బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు డ్రైనేజీ పనులను ఎంపీడీఓ ఆనంద్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం గ్రామాల్లో మురుగు కాలువల తీరును పరిశీలించిన ఆయన ఎప్పటికప్పుడు దోమలు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ పౌడర్ను చల్లాలని సిబ్బందికి సూచించారు.

సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. కరోనా వైరస్ ను నివారించేందుకు ప్రతి ఒక్కరు ఇంటి నుండి బయటికి రాకుండా జాగ్రత్త పడాలని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అత్యవసరమైతేనే తప్ప ఇంటి నుండి బయటికి రావాలని వచ్చిన మాస్కులు ధరించి పని పూర్తి చేసుకుని త్వరగా ఇంటికి వెళ్లాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓతోపాటు  వైస్ఎంపిపి రాజు  పటేల్ సర్పంచ్ విజయలక్ష్మి భూమి శెట్టి, సొసైటీ చైర్మన్ ఇందిరా ప్రహ్లాద్ దేశాయి  పంచాయతీ పాలకవర్గ సభ్యులు పారిశుద్ధ్య కార్మికులు గ్రామస్తులు ఉన్నారు.

Related posts

ఎండ‌ను లెక్క చేయకుండా సిబ్బందిని అలెర్ట్ చేస్తున్న పోలీస్ బాస్…!

Satyam NEWS

జీవో 1 ని పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం ఆగదు

Satyam NEWS

బూస్టర్ డోసుపై మారటోరియం.. దేశాలకు డబ్ల్యూహెచ్ఓ సూచన

Sub Editor

Leave a Comment