దేశంలో సగటు ఓటరు ఎక్కడ ఉంటున్నా తన స్వస్థలంలో ఓటు వేసేలా చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోందని ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు.ఈ మేరకు ఎన్నికల సంఘం ఐఐటీ మద్రాస్ సహకారంతో బ్లాక్ చైన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఈ విధానం అమలులోకి వస్తే రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి చెన్నైలో ఉంటున్నా, ఆక్కడ ఎన్నికలు జరిగినప్పుడు తన ఓటు వేయొచ్చని వివరించారు. ఇందుకు చట్టంలోనూ మార్పులు అవసరమన్నారు.ఇందుకోసం ప్రభుత్వ అనుమతి తీసుకుంటామని అరోరా తెలిపారు.
previous post