అయన ముఖ్యమంత్రిగా గెలిచినా ప్రత్యేకం గా తన ప్రమాణ స్వీకారానికి ఎవరినైనా పిలువొచ్చు.ప్రధాన మంత్రినో,ఏ రాష్ట్ర ముఖ్య మంత్రినో ,మంత్రులనే,బంధువులనో పి లువొచ్చు.కానీ సామాన్య ప్రజలకు ప్రతీక గా నిల్చిన అయన అచ్చం తన రూపం లో ఉన్న ఓ చిన్నారిని తన ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిథిగా పిలిచారు,ఆయనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ .
కేజ్రీవాల్ గెటప్‌లో ఉన్న ఓ బుడతడి ఫోటోను ఆప్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ‘బేబీ కేజ్రీవాల్’ ఫోటోను నెటిజన్లు తెగ షేర్ చేశారు. కేజ్రీవాల్ హ్యాట్రిక్ విజయంపై సోషల్ మీడియాలో ఎంతగా చర్చ జరిగిందో బేబీ కేజ్రీవాల్’ గురించి కూడా అదే స్థాయిలో చర్చ జరిగింది. కాగా ఈ నెల 16న జరగనున్న కేజ్రీవాల్ ప్రమాణస్వీకారంలో పాల్గొనాలని లిటిల్ కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తూ ఆప్ ట్విట్టర్‌లో వెల్లడించింది.దీనితో ఈ బాయ్ ప్రత్యేక అతిథి గా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి హాజరవు తున్నాడు కూడా.