35.2 C
Hyderabad
April 27, 2024 13: 45 PM
Slider మహబూబ్ నగర్

ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ భూమిని కబ్జా

#governmentland

కల్వకుర్తి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వ భూమినే కబ్జా చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో సర్వే నెంబర్ 99/ 3 లో పురపాల శాఖకు చెందిన 35/1నెంబర్ గల ప్లాటును విద్యుత్ కార్మిక భవనం నిర్మాణం చేపట్టారు. 2016 లో ఈ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అప్పటి గ్రామపంచాయతీ కార్యదర్శి పై తెలంగాణ రాష్ట్ర రివైజ్డ్ పెన్షన్ రూల్ 1980 (9) సబ్ రూల్స్ ( 2) బి ప్రకారం చర్యలు తీసుకున్నట్లు జిల్లా పంచాయతీ ఆఫీసర్ నివేదికలో పేర్కొన్నారు.పూర్తి వివరాల్లోకి వెళితే మాజీ సైనికుడికి 2 ఎకరాల 10 గుంటలు ప్రభుత్వం కేటాయించింది. ఆయన విల్సన్, మీ .రెడ్డి .మధుసూదన్, కే శ్రీనివాసులు, ఏడి నవీన్ కుమార్ నలుగురికి అమ్మినారు. కాగా ఈ నలుగురు అప్పటి గ్రామ పంచాయతీ అనుమతి తీసుకుని లేఅవుట్ చేశారు. అందుకుగాను 10 శాతం భూమిని గ్రామపంచాయతీకి ఇచ్చారు. వీరు కూడా మోసపూరితంగా మూడు లేఔట్లను విడుదల చేశారు. అన్నింటికీ గ్రామపంచాయతీ అధికారుల సంతకాలు, ముద్రలు ఉన్నాయి.

గ్రామపంచాయతీ కేటాయించే భూమిలో కూడా మోసపూరితంగా10 శాతం కంటే తక్కువనే ఇచ్చారు. అందులో ప్లాట్ నెంబర్ 35,35/1,36,36/1 నాలుగు ప్లాట్లకు గాను వారే రెండు ప్లాట్లను అమ్ముకున్నారు. మిగతా ఒక ప్లాటు కబ్జా అయింది.

మొత్తం ఒక కోటి యాభై లక్షల నుండి రెండు కోట్ల విలువ గల పురపాలక సంఘానికి చెందవలసిన ప్లాట్లు అన్యక్రాంతమయ్యాయి. రెండు ఎకరాల 10 గుంటల్లోనే రెండు కోట్ల వరకు మోసం జరిగితే కల్వకుర్తి పట్టణంలో వేల కోట్ల రూపాయలు విలువ గల ప్లాట్లు భూములు కబ్జాకు అధికారుల అధికార పార్టీ నాయకుల ప్రోత్బలంతో కబ్జాలకు గురవుతున్నాయి.ఒక సామాజిక కార్యకర్త అధికారుల దృష్టికి తీసుకువెళ్లి లోకాయుక్తను ఆశ్రయించడంతో ఈ భూ కబ్జా బండారం బయటపడింది. లోకాయుక్త లో కేసు ఉన్నప్పుడు విద్యుత్ ఉద్యోగులు నిర్మాణం చేపట్టి మంగళవారం విద్యుత్ కార్మికుల కార్యాలయ ప్రారంభోత్సవాన్ని చేపట్టారు. గ్రహించిన సామాజిక కార్యకర్త మున్సిపల్ కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రారంభోత్సవాన్ని అడ్డుకోవడంతో 150 మందికి పైగా విద్యుత్ ఉద్యోగులు మున్సిపల్ అధికారులపై దౌర్జన్యానికి దిగినట్లు కాలనీవాసులు ఆరోపించారు.

ఇట్టి విషయంపై పురపాలక సంఘం టౌన్ ప్లానర్ తాడి విజయకుమార్ ను వివరణ కోరగా సోమవారం జీవో నెంబర్ 72 ప్రకారం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం సోమవారం వారికి నోటీసు ఇచ్చినట్లు వారం తర్వాత ఆ నిర్మాణాన్ని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. కొందరు నాయకులు ఇట్టి విషయంపై పురపాలక సంఘాం అధికారులను వారి ముందు విధులు సక్రమంగా నిర్వహించినట్లు మెచ్చుకుంటూ వెనుక విద్యుత్ ఉద్యోగులను రెచ్చగొట్టి ఏం కాదు ప్రారంభోత్సవాన్ని నిర్వహించండి అంటూగోడ మీద పిల్లి లా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికైనా కల్వకుర్తి పట్టణంలో పురపాలక సంఘానికి లే అవుట్ రూపేనా కేటాయించిన 10 శాతం భూమిని అన్యక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఏ ప్రకారం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.

Related posts

సమన్వయంతో సాగుతాం

Bhavani

29 నుండి జులై 7 వరకు తాళ్లపాకలో శ్రీ సిద్ధేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Bhavani

ముంపు బాధితులను ఆదుకోండి

Bhavani

Leave a Comment