పాలేరు నియోజక వర్గ పరిధిలో ఉన్న డబుల్ ఓటర్ల జాబితా పై నిగ్గు తేల్చాలని కోరుతూ పాలేరు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఖమ్మం రూరల్ తహాశీల్దార్ రామకృష్ణకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి ఫిర్యాదుచేశారు.
నియోజకవర్గ వ్యాప్తంగా 1500 కు పైగా ఓటర్ల పేర్లు రెండు వేర్వేరు పోలింగ్ బూత్ కేంద్రాల్లో నమోదై ఉన్నట్లు తాము గుర్తించామని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. వారు గుర్తించిన జాబితాను ఎన్నికల అధికారికి అందచేశారు. ఈ సందర్భంగా స్వర్ణకుమారి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో 1568 మంది ఓటర్లలో కొంతమంది ఓటర్ల పేర్లు ఇక్కడే ఉన్న రెండు వేర్వేరు పోలింగ్ బూత్ లలో నమోదైఉన్నాయన్నారు.
అదేవిధంగా మరికొంతమంది ఓటర్ల పేర్లు పాలేరు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ కేంద్రాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న పోలింగ్ బూత్ కేంద్రాల్లోనూ నమోదై ఉన్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆధారాలతో సహా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించమన్నారు. ఆ జాబితా ను పరిశీలించి డబుల్ ఓటర్లను తొలగించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గానికి చెందిన మండలాల నాయకులు పాల్గొన్నారు.