33.7 C
Hyderabad
April 30, 2024 01: 51 AM
Slider విజయనగరం

ఈ వారం పోలీసు స్పందనకు ఎంతమంది వచ్చారంటే…?

#spandana

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక “స్పందన” ను నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా ఎస్పీ గారు 39 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

వేపాడ మండలం బొద్దాం చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన తండ్రికి వారసత్వంగా సంక్రమించిన భూమిని తన దగ్గరి బంధువులు ఆక్రమించుకొనేందుకు దౌర్జన్యాలకు పాల్పడుతూ, తమపై తప్పుడు కేసులు పెడుతూ, వేధింపులకు పాల్పడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని ఎస్. కోట సిఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తూ ఛార్ధామ్ యాత్రలో భాగంగా డెహ్రాడూన్ లోగల ఒక ట్రావెల్ ఏజన్సీకి హెలికాప్టర్లో డెహ్రాడూన్ నుండి కేదారినాధ్ వెళ్ళేందుకు ఒక్కొక్కరికి  5వేలు చొప్పున 80వేలు చెల్లించినట్లు, కానీ, సదరు ట్రావెల్ ఏజన్సీ తమకు హెలికాప్టర్ సౌకర్యం కల్పించలేదని, డబ్బులను తిరిగి చెల్లించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని 1వ పట్టణ సిఐ డా.వెంకటరావును ఆదేశించారు.

బాడంగి మండలం గజరాయినివలస కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, బొబ్బిలి పట్టణానికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు ఇంటి స్థలం కొరకు వాయిదాల పద్ధతిలో నెలకు 350/- ల చొప్పున 60మాసాలు చెల్లించినట్లు, కానీ, సదరు రియల్ ఎస్టేట్ సంస్థ వారు తమకు ఇంత వరకు రిజిస్ట్రేషను చెయ్యకుండా తాత్సారం చేస్తున్నట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి సిఐను ఆదేశించారు.

విజయనగరంకు చెందిన ఒకామె ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు లంకాపట్నంలో ఇంటి స్థలం కలదని, సదరు స్థలంకు తాము నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తప్పుడు ధృవ పత్రాలు సృష్టించి, ఇంటి నిర్మాణం చేపట్టాడని, తహశీల్దారు  విచారణ చేపట్టి, సదరు ధృవ పత్రాలు నకిలీవిగా నిర్ధారించారని, వారిపై చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని 2వ పట్టణ సిఐ లక్ష్మణరావు ను ఆదేశించారు.

కొత్తవలసకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు 2011లో వివాహం అయ్యిందని, తన భర్త, ఇతర కుటుంబ సభ్యులు అదనపు కట్నం కొరకు, తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, తన కు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేసి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని దిశ మహిళా పిఎస్ సిఐ శేషును ఆదేశించారు.

విశాఖపట్నంకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను ఒక వ్యక్తి నుండి ఇంటి స్థలంను కొనుగోలు చేసినట్లు, డబ్బులను పూర్తి చెల్లించినట్లు, కానీ, సదరు వ్యక్తి అదే ఇంటి స్థలంను తమకు తెలియకుండా వేరొక వ్యక్తికి అమ్మేసినట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని గంట్యాడ ఎస్ఐ కిరణ్ ను ఆదేశించారు. ఇలా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను, వెంటనే తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, డిసిఆర్బి సిఐ జె.మురళి, ఎస్బీ సిఐలు రుద్రశేఖర్, డిసిఆర్బి ఎస్ఐ వాసుదేవ్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

లక్ష్యాలను నిర్దేశిత సమయంలో సాధించాలి

Bhavani

కమనీయం రమణీయం శ్రీశైల మల్లన్న రథోత్సవం

Satyam NEWS

టీడీపీ నేతల అద్వర్యంలో కరోనా నివారణకు ఆనందయ్య మందు పంపిణీ

Satyam NEWS

Leave a Comment