21.7 C
Hyderabad
December 2, 2023 04: 02 AM
Slider గుంటూరు

జనసేన కి గాజు గ్లాసు గుర్తు కేటాయించలేదు

#glass symbol

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో గాజుగ్లాసు గుర్తు కేటాయించినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మీడియా కు ప్రకటన విడుదల చేశారు.

నిబంధనల ప్రకారం గుర్తులు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తేదీ 12.12.2023 న మాత్రమే గుర్తుకు దరఖాస్తులు చేసుకోవాలి అని ఇంకా ఆ సమయం రాలేదని,కావాలని ప్రజల్ని ఆయోమయానికి గురిచేసింది జనసేన పేరుతో వచ్చిన లేఖ అని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో పోటీకి గ్లాసుగుర్తు గుర్తు కేటాయించిన ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు.ఆంధ్రప్రదేశ్ లో పోటీకి ఇంకా గ్లాసుగుర్తు ఇవ్వలేదని,జనసేన పార్టీ నుండి చేసుకున్న ప్రచారాన్ని కొట్టివేశారు.

Related posts

డ్రంకెన్ గరల్స్:తాగారు తూలారు సస్పెండ్ అయ్యారు

Satyam NEWS

పంటపొలాల్లో సీపీఐ నాయకుల ఒకరోజు నిరాహార దీక్ష

Satyam NEWS

ఆస్ట్రేలియా కార్చిచ్చుపై ఎంపీ సంతోష్‌ కుమార్‌ ట్వీట్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!