ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న 1989 బ్యాచ్ హెడ్ కానిస్టేబుల్ పి.ఆనందరావు రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో హుటహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
మరణ వార్త తెలుసుకున్న ఖమ్మం టూ టౌన్ సిఐ కుమారస్వామి, తోటి పోలీసు సిబ్బంది, పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వేంకటేశ్వర్లు, మోహన్ రావు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తన స్వగ్రామం రాయన్న పేట చెరువుమాధరంలో అంత్యక్రియలు నిర్వహించారు.