29.2 C
Hyderabad
October 13, 2024 15: 01 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

సమాచార హక్కు చట్టం కిందికి ప్రధాన న్యాయమూర్తి

supreem court

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధిలోకే వస్తుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. సీజేఐ కార్యాలయం ఆర్‌టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు ధర్మాసనం సమర్థించింది.  సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ధర్మాసనంలోని మెజార్టీ న్యాయమూర్తులు దిల్లీ హైకోర్టు తీర్పునే సమర్థించడం గమనార్హం. ఆర్‌టీఐ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించగా.. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌, కోర్టుకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఈ ఏడాది ఏప్రిల్‌ 4న తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా తీర్పు వెలువరించింది. దీనిపై దాఖలైన అప్పీళ్లను తోసిపుచ్చింది. అయితే, ఆర్టీఐని నిఘా అస్త్రంగా వినియోగించరాదని, న్యాయవ్యవస్థ స్వతంత్రను దృష్టిలో ఉంచుకుని దీన్ని వినియోగించాలని సూచించింది. అంతేకాకుండా కొలీజియం ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను మాత్రమే ఆర్టీఐ కింద ఇస్తామని, అందుకు గల కారణాలను మాత్రం వెల్లడించేది లేదని ధర్మాసనం చెప్పింది.

Related posts

బిజెపికి బలం లేకపోతే ఇంత మంది ఎందుకు వచ్చారు?

Satyam NEWS

రాపిడ్ టెస్టింగ్ కిట్ పేరుతో జరుగుతున్న దోపిడి

Satyam NEWS

చావు దెబ్బలతో రక్తం కారుతున్న హస్తం

Satyam NEWS

Leave a Comment