35.2 C
Hyderabad
May 1, 2024 00: 38 AM
Slider ఖమ్మం

వారం లోగా రుణమాఫి ప్రక్రియ పూర్తి

#Gautham

పంట రుణ మాఫీకి సంబంధించి ప్రక్రియ అంతా వారంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం తో కలిసి, అధికారులతో పంట రుణ మాఫీ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం లక్ష రూపాయల పంట రుణమాఫీ క్రింద కుటుంబానికి లక్ష రూపాయల పంట రుణమాఫీ వర్తిస్తుందన్నారు. పంట రుణమాఫీ పొందిన రైతులకు పంట రుణాల రెన్యూవల్ చేయాలన్నారు.

మొదటి విడతగా రూ. 25 వేల వరకు పంట రుణమాఫీకి గాను జిల్లాలో 20343 మంది రైతులకు రూ. 26.015 కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. రెండో విడతగా రూ. 25 వేల నుండి రూ. 50 వేల వరకు ఉన్న పంట రుణమాఫీకి 22335 మంది రైతులకు రూ. 70.004 కోట్లు, మూడో విడత క్రింద లక్ష వరకు పంట రుణాలు ఉన్న 46415 మంది రైతుల ఖాతాల్లో రూ. 278.401 కోట్లు, మొత్తంగా 89093 మంది రైతులకు పంట రుణమాఫీ క్రింద రూ. 374.42 కోట్లు వారి వారి ఖాతాల్లో జమచేసినట్లు ఆయన అన్నారు.

ఇందులో డిసిసిబి కి చెందిన 44 వేల ఖాతాలకు రూ. 130 కోట్లు జమ అయ్యాయని ఆయన తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్ల నుండి జాబితా తీసుకొని పంట రుణాల రెన్యూవల్ కి చర్యలు తీసుకోవాలని అన్నారు. జమ అయిన ఖాతాలు రైతుల వారిగా జాబితా చేయాలన్నారు. ఏఇఓ క్లస్టర్ వారిగా, మండలాల వారిగా రోజువారి ప్రగతిని సమర్పించాలన్నారు. పంట రుణ మాఫీ అందని వారికి, ఏ కారణం చేత జరిగింది పరిశీలించి, వారి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. మరణించిన రైతుల వివరాలు తీసుకొని, ఆయా తహశీల్దార్ల నుండి కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పొంది, వారికి పంట రుణమాఫీ అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

సమావేశంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ, పంట రుణమాఫీ విడుదల మొత్తం సెలవు దినాల్లోనూ పనిచేసి 4 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. రైతులకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, డిసిసిబి సిఇఓ వీరబాబు, ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, డిసిఓ విజయ కుమారి, ఇంచార్జి డీఏఓ సరిత, బ్యాంకర్లు, ఏడీఏలు, ఏవోలు, సొసైటీ సిఇఓ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజాసమస్యలపై బిజెపి నేతల పాదయాత్ర

Satyam NEWS

అనంతపురం డీ మార్ట్ దగ్గర ప్రమాదంలో నలుగురు మృతి

Satyam NEWS

అసంపూర్తి అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకోని రాజకీయ పెద్దలు

Satyam NEWS

Leave a Comment