కొల్లాపూర్ లోని చారిత్రాత్మక రాజ కోట బంగ్లా ప్రహరి మూడు వైపుల స్థలాలను కాపాడాలని టిపిసిసి కార్యనిర్వాహణ కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి కోరారు. బుధవారం కొల్లాపూర్ పురపాలక కార్యాలయంలో పట్టణ కేంద్రంలోని రాజా బంగ్లా ప్రహరీ స్థలల అనుమతులను వెనక్కి తీసుకోవాలని టీపీసీసీ జగన్ మోహన్ రెడ్డి, సిపిఎం నాయకులు శివ వర్మా, టిఆర్ఎస్ మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు పసుపుల నరసింహ్మ మాలల చైతన్య సమితి జిల్లా అధ్యక్షుడు మద్యాల రాందాస్ ఆధ్వర్యంలో కమిషనర్ వెంకటయ్య అందుబాటులో లేకపోవడంతో ఎఇ నరసింహ్మ కు విన్నతి పత్రం ఇచ్చారు. అనంతరం టీపీసీసీ కార్య నిర్వహణ కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి, సీపీఎం నాయకులు శివ వర్మా మాట్లాడారు. కొల్లాపూర్ ప్రాంతానికి చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్నల రాజ బంగ్లా ప్రహరి మూడు వైపులా ఉన్న ఖాళీ స్థలాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఆ స్థలాని అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలన్నారు. రాజా వారు, ప్లాట్ల రూపంలో అమ్ముకోవడం న్యాయం కాదన్నారు. రాజావారి తాతల కాలంలో 1954లో రాజ బంగ్లా మూడు వైపుల ప్రహరి స్థలం ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. ఇప్పుడు రాజావారు ప్లాట్లు గా మార్చి ఎలా అమ్ముకుంటారని ఇది తగదన్నారు. కొల్లాపూర్ కమిషనర్ వెంకటయ్య అనుమతులు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కోర్టులో కేసు ఉన్న సంగతి తెలిసి అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రశ్నించిన వారిపై కొందరు రాజకీయ నాయకులు స్వార్థపరులు ప్లాట్లు కొన్న ప్రజలను గొడవలకు ప్రేరేపిస్తున్నారని అన్నారు. కుట్రలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తక్షణమే కమిషనర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, కోట ప్రహరీ స్థలాన్ని పరిరక్షించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పరుశరాం, ఖాదర్, ఖాదర్ పాషా, శీలం వెంకటేష్, కంటే శివన్న, జూపల్లి వర్గీయులు బిజ్జ రమేష్, పుట్టపోగా నరసింహ్మ తదితరులు పాల్గొన్నారు.