41.2 C
Hyderabad
May 4, 2024 18: 41 PM
Slider గుంటూరు

నవంబర్ 4న చింతామణి సొంత మొగుడు చిత్రం విడుదల

#chintamani

జూనియర్ పవన్ కళ్యాణ్  హీరోగా, మగువ సినిమాలో నటించిన  నటి మధుప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం చింతామణి సొంత మొగుడు ఈ చిత్రం పల్నాడు జిల్లా సత్తెనపల్లి లోని శ్రీనివాస మహల్ లో మాత్రమే విడుదల అవుతున్నది. ఈ చిత్రంలో ఆనందభారతి విలన్ గా, జబర్దస్త్ అప్పారావు,  చిట్టిబాబు లతోపాటు సత్తెనపల్లిలోని కళాకారులు నటించారు.

ఆంధ్రభూమి విలేకరిగా, ప్రజానాట్యమండలి సత్తెనపల్లి నియోజకవర్గ కార్యదర్శిగా,  ప్రగతి స్కూలు లో ఉపాధ్యాయుడిగా  పనిచేస్తున్న చెన్నకేశవ ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామిగా ఆయన ఈ సినిమాలో కనిపిస్తారు.  ఈ సినిమా సన్నివేశాలను చాలావరకు సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు.

ఈ సినిమా నవంబర్ 4న  సత్తెనపల్లిలోని శ్రీనివాస మహల్ లో  రోజుకు నాలుగు ఆటలుగా రిలీజ్ అవుతుంది. ఈ కుటుంబ కథా చిత్రాన్ని కుటుంబ సమేతంగా  వచ్చి  సినిమాని చూసి సత్తెనపల్లి కళాకారులను ఆశీర్వదించాలని నిర్మాతలు హృదయపూర్వకంగా  కోరుకుంటున్నారు.

Related posts

క‌వితాసేనాని…

Satyam NEWS

ఖమ్మం జిల్లాలో పోటెత్తుతున్న వరద నీరు

Satyam NEWS

ఎన్ని సార్లు గుండె నొప్పి వస్తుది కోడెలా?

Satyam NEWS

Leave a Comment