Slider ముఖ్యంశాలు

అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఏడుగురిపై కేసు నమోదు

#AP CID Police

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై అత్యంత అసభ్యకరంగా, తీవ్ర అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన ఏడుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలపై ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసులు నమోదు చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి.

వీరు విచారణకు హాజరు కావాలంటూ సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన వారికిలో దరిశ కిషోర్‌రెడ్డి, లింగారెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, చందురెడ్డి, శ్రీనాథ్‌ సుస్వరం ఉన్నారు.

వీరిపై ఐటీ యాక్ట్ సెక్షన్‌ 67, ఐపీసీ 505(2), ఐపీసీ 506, ఐపీసీ 153(ఏ)సెక్షన్‌ల కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు హైకోర్టుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 49 మందికి మంగళవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.  

Related posts

ఆదౌ పూజ్యో గణాధిపః

Satyam NEWS

కరోనాపై యుద్ధానికి మహేష్ బాబు కోటి విరాళం

Satyam NEWS

ఎమ్మెల్యే విడదల రజని పాలన లో లంచగొండి తనం పై గళమెత్తిన వైసిపి నేత

Satyam NEWS

Leave a Comment