33.7 C
Hyderabad
April 29, 2024 01: 25 AM
Slider కరీంనగర్

పేర్లు మార్పుతో బతుకులు మారుతాయా ?

#malamahanadu

‘ఇండియా’ పేరుకు బదులుగా “భారత్” గా  మార్చవలసిన అవసరం ఏముందని మాల మహానాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వజి అజయ్ ప్రశ్నించారు. పేర్లు మారినంత మాత్రాన ప్రజల జీవితాలో మార్పు రాదు. మౌలికమైన అవసరాలను తీర్చకుండా, పాలన విధానంలో మార్పు రాకుండా ఎన్ని పేర్లు మార్చినా ప్రయోజనం ఉండదన్నారు.

ఒకవైపు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని గొప్పగా చెప్పుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ అని ఉత్సవాలు చేసుకుంటున్నాం. అదే సమయంలో  దారిద్ర్య రేఖకు దిగువనున్న (బిపిఎల్) వర్గాల సంక్షేమం, పేదరికం నిర్మూలన పథకాలను కొనసాగిస్తున్నాం. ప్రజల ప్యాకెట్ మనీలో సింహభాగం విద్య, వైద్యానికే  ఖర్చవుతుందని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు.

నిరుద్యోగం పెరుగుతూ ఉందని, వైద్యం అందక పేదలు తనువు చలిస్తున్నారని ఆయన అన్నారు.  ఇన్ని సమస్యలు తండావిస్తూ ఉంటే వాటికి శాశ్వత పరిష్కారం చూపలేని ప్రభుత్వలు పేర్లను మార్పుతో వచ్చే ప్రయోజనం ఏమీ లేదన్నారు. పాలకులు వారి ఎజెండా కోసం, తమదైన ముద్ర కోసం పేర్లు మార్చుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు. ప్రజల బ్రతుకులను మార్చలేని ఈ పేర్ల మార్పుతో వచ్చే ప్రయోజనం శూన్యమన్నారు.

ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నికైనవారు, దేశాన్ని పాలించే నేతలు, ప్రజల ఓట్లతో అధికార పీఠాన్ని ఎక్కిన ప్రజలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడనంత కాలం వారి బతుకులు మార్పు లేనంత కాలం దేశం మొదలు గల్లీ వరకు ఎన్ని పేర్లు మార్చినా, వరిగేదేమీ ఉండదు అన్నారు.

దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న యోచనను సుప్రీం కోర్ట్ గట్టిగా వ్యతిరేకించింది అన్నారు. ఈ మేరకు కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ 2016లో దాఖలైన పిల్ ను నాటి సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాగూర్ సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసిందనీ ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించే సమస్య లేదని కుండబద్దలు కొట్టిందని గుర్తు చేశారు. 2020లో కూడా ఇలాంటి మరో పిల్ ను  కూడా  తిరస్కరించిందని అన్నారు.

Related posts

ఫ్యామిలీ క్లాష్: మద్యం మరణాలు మొదలు

Satyam NEWS

వ్యాధుల నివారణే లక్ష్యంగా మణిపాల్ గుడ్ హెల్త్ రన్

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: సినిమా షూటింగులు రద్దు చేద్దాం

Satyam NEWS

Leave a Comment