33.2 C
Hyderabad
May 15, 2024 20: 09 PM
Slider నల్గొండ

ఈనెల 13న కలెక్టర్ కార్యాలయ ముట్టడి విజయవంతం చేయాలి

#CITUHujurnagar

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చట్టాల పేరుతో 1996 చట్టాన్ని 1979 చట్టాన్ని అంతర్ రాష్ట్ర కార్మిక వలస చట్టాన్ని రద్దు చేయడం అన్యాయమని, దీనికి వ్యతిరేకంగా ఈనెల 13న, కలెక్టర్ కార్యాలయం ధర్నా ముట్టడి కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న రోషపతి మాట్లాడుతూ కేంద్రంలోని రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం 44 చట్టాలను  మార్చడం దొంగచాటుగా  శ్రమజీవులను దోచుకోవడానికి ఇది నిదర్శనం అన్నారు.

కరోనా కష్టకాలంలో కార్మికులని ఆదుకోవాల్సింది పోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు హాని చేసే నిర్ణయాలు చేయడం సరైంది కాదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్పర్ బోర్డు నిధులు వెయ్యి కోట్లు పైగానే అక్రమంగా దారి మళ్ళించిందని, మొత్తాన్ని హెల్పర్ బోర్డు కమిటీ జమ చేయాలని కోరారు.

హెల్పర్ బోర్డు కమిటీలో అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులను చేర్చాలని, కరోనా కాలంలో  ప్రతి కార్మికుడికి పది వేల రూపాయల చొప్పున 6 నెలలు ఇవ్వాలని, అర్హులైన కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.

గత సంవత్సరం సహజ మరణాలు, యాక్సిడెంట్ ప్రసూతి సహాయం, పెళ్ళికానుక  ఇతర పెండింగ్ లో ఉన్న అన్ని నిధులు తక్షణం విడుదల చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం జిల్లా నాయకులు  ఎస్కే సైదా, బంక శ్రీనివాస్ రెడ్డి, ఎస్ కే ముస్తఫా, ఎన్నబోయిన శ్రీను, రఫీ బాల కోటయ్య, బాబులు, శ్రీను, గోవిందు, కాసులు,రామకృష్ణ ,వినాయకరావు, గొపి తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రామాల అభివృద్ధికి సాయం అందిస్తాం

Bhavani

మమ్ములను విమర్శించిన వారికి ఇదే సమాధానం

Satyam NEWS

ఏసిబి కి చిక్కిన ఉన్నతాధికారి

Sub Editor 2

Leave a Comment