38.2 C
Hyderabad
May 2, 2024 22: 58 PM
Slider ప్రపంచం

శాంతి స్థాపనలో ఆఫ్ఘన్ కు భారత్ సంపూర్ణ మద్దతు

#Abdullah

ఆఫ్ఘనిస్థాన్ శాంతి స్థాపన ప్రక్రియలో భారత్ ఇస్తున్న మద్దతు ఎంతో కీలకమైనదని రాయబారి అబ్దుల్లా అబ్దుల్లా తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా భారత్ వచ్చిన ఆయన శాంతి స్థాపన ప్రక్రియ లో భారత్ పాత్ర పై విస్తృత చర్చలు జరిపారు.

పాకిస్తాన్ ప్రాబల్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు భారత్ ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నది. అమెరికా సేనలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి వైదొలగుతున్న నేపథ్యంలో భారత్ పాత్ర మరింత కీలకంగా మారిందని అబ్దుల్లా అన్నారు.

 తాలిబాన్ల తో శాంతి ఒప్పందం చేసుకుంటున్న ఆఫ్ఘనిస్థాన్ పై గత రెండేళ్లగా ఉన్న అభిప్రాయాన్ని భారత్ మార్చుకున్నదని, ఇప్పుడు పూర్తిగా సహాయ సహకారాలు అందించేందుకు సంసిద్ధంగా ఉన్నదని అబ్దుల్లా తెలిపారు.

ఉపఖండంలో శాంతి నెలకొల్పేందుకు, ఉగ్రవాదుల కార్యకలాపాలను పూర్తిగా అణచివేసేందుకు భారత్ తమకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Related posts

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ‘సలార్’

Satyam NEWS

జగిత్యాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Satyam NEWS

ములుగు జిల్లాలో రైతు చట్టం వ్యతిరేక ఆందోళన

Satyam NEWS

Leave a Comment