41.2 C
Hyderabad
May 4, 2024 15: 46 PM
Slider ముఖ్యంశాలు

ఏసిబి కి చిక్కిన ఉన్నతాధికారి

acb trapped officer

మిర్యాలగూడలో ఏసీబీ అధికారులు పన్నిన వలలో విద్యుత్ శాఖకు చెందిన ఓ అవినీతి అధికారి చిక్కారు.  తమ శాఖ కె చెందిన ఓ లైన్ మెన్ వద్దనుండి ఏకంగా 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ మరో ఇద్దరు అధికారులతో కలిసి అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెడ్డి కాలనీకి చెందిన గుంటూరు శ్రీనివాస్ 1997 నుండి విద్యుత్ శాఖలో లైన్ మెన్ గా పని చేస్తున్నాడు. 2004 సంవత్సరాల్లో తన కుమారుడి వైద్య చికిత్స కోసం వారం రోజులు సెలవు తీసుకున్నాడు. అతడు సెలవుల్లో కొనసాగుతుండగానే మిర్యాలగూడ నుండి మరో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తూ రిలీవ్ ఆర్డర్ నోటీస్ చేశారు.ఈ విషయం తెలియని లైన్ మెన్ శ్రీనివాస్ సరైన సమయంలో రిపోర్ట్ చేయలేకపోయాడు.

తిరిగి పోస్టింగ్ కోసం ఉన్నత అధికారులకు పదే పదే విజ్ఞప్తి చేసుకున్న తర్వాత మూడు వందల యాభై రోజుల తర్వాత సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పాలకవీడు గ్రామ లైన్మెన్ గా పోస్టింగ్ ఇచ్చారు.కాగా ఈ మూడు వందల యాభై రోజులను రెగ్యులరైజేషన్ చేసి అన్ని బెనిఫిట్స్ వచ్చేలా చూడాలని కోర్టును ఆశ్రయించాడు.

చివరకు విద్యుత్ ఉన్నతాధికారుల హామీతో లైన్ మెన్ శ్రీనివాస్ రాజీ కోచ్చాడు.ఈ క్రమంలోనే తనకు రావలసిన ప్రమోషన్ ఇతర బెనిఫిట్స్ తో లీవ్ రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఎస్ ఇ ఆమోదం తెలిపారు.కాగా లంచం ఇస్తేనే కానీ పని కాదన్న మిర్యాలగూడ డిఈ మురళీధర్ రెడ్డి ఫైల్ పక్కన పెట్టడంతో. చివరకు రెండున్నర లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్న లైన్ మెన్ శ్రీనివాస్ ఈ మేరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

వారి సూచనల మేరకే రెండు లక్షల రూపాయలను జెఎఓ దామోదర్ యూడిసి లతీఫ్ ల ద్వారా డిఈ మురళీధర్ రెడ్డికి అందజేస్తూ ఉండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి లంచం తీసుకున్న అధికారులను పట్టుకున్నారు.ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

అవినీతికి పాల్పడిన అధికారులను ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తాం అన్నారు.లీవ్ రెగ్యులరైజేషన్ కోసం డిఈ మురళీధర్ రెడ్డి తన వద్ద ఏడు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాడని,చివరకు రెండున్నర లక్షలకు ఒప్పుకున్నాడని బాధితుడు లైన్ మెన్ గుంటూరు శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. డిఈ వేధింపులు తాళలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు చెప్పారు.

Related posts

అభివృద్ధి పనులకు మంత్రి అజయ్ శంకుస్థాపన

Satyam NEWS

వాల్మీకి దేవాలయ శిలామండప నిర్మాణనికి భారీ విరాళం

Satyam NEWS

శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

Leave a Comment