38.7 C
Hyderabad
May 7, 2024 18: 37 PM
Slider నల్గొండ

కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండలం సిమెంటు పరిశ్రమంలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని,చలో హైదరాబాద్ కి పెద్ద ఎత్తున కదిలి రావాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కోరారు.

మేళ్ళచెరువు మండలం లోని మై హోమ్,సువర్ణ,ప్రియా తదితర సిమెంట్ పరిశ్రమలలో ఇతర రాష్ట్రాల కార్మికులకు హిందీ కరపత్రం,తెలుగు కరపత్రములు పంచి చలో హైదరాబాద్ ఆగస్టు 3కి,పెద్ద ఎత్తున కదలి రావాలని,వారి సమస్యలు తెలుసుకొన్న రోషపతి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరం నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మిట్ చేయాలని 9 సంవత్సరాల నుంచి కనీస వేతనం అమలు చేయకపోవడం,ఈనాడు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని పరిశ్రమల యాజమాన్యాన్ని కోరారు.

సిమెంట్ పరిశ్రమల యాజమాన్యం కనీస వేతన 26,000 రూపాయలు ఇవ్వాలని,రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోరాటంలో అన్ని వర్గాల,ఇతర రాష్ట్రాల కార్మికులు పెద్ద ఎత్తున కదిలి రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కృష్ణపటే ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ నాయకులు తీగల శ్రీను, నాగేశ్వరరావు, ప్రసాదు, గిరి,రామకృష్ణ, ప్రభాకర్ నాయక్,హనుమాన్ తదితర నాయకులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

నెల్లూరు రూరల్లో అభివృద్ధే ప్రతిపక్షాలకు సమాధానం

Bhavani

గోవా లో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత

Satyam NEWS

పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వ‌ర్క‌ర్ల కృషి మ‌రువ‌లేనిది

Satyam NEWS

Leave a Comment