38.2 C
Hyderabad
April 29, 2024 11: 45 AM
Slider నెల్లూరు

నెల్లూరు రూరల్లో అభివృద్ధే ప్రతిపక్షాలకు సమాధానం

#Nellore rural areas

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధే ప్రతిపక్షాలకు సమాధానమని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 26వ డివిజన్లో రోడ్లు, డ్రైన్లకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రమౌళి నగర్లో డ్రైన్లకు 20 లక్షల రూపాయలు, టీచర్స్ కాలనీలో రోడ్లకు 20 లక్షల రూపాయలు మంజూరు చేసామని తెలిపారు.

ఇంకా కావాలని అడిగితే మరో 20 లక్షలు మంజూరు చేసామని తెలిపారు. మొత్తంగా 26 డివిజన్కు కోటి 20 లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. వీటితో ఈ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఎక్కడ అవసరాలు ఉన్నాయో వాటిని పూర్తిచేయాలని స్థానిక నేతలను కోరారు. దీని తర్వాత కూడా మరిన్ని నిధులు తెచ్చి డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం అడగంగానే 5 కోట్ల రూపాయలు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఒకపక్క అంతులేని సంక్షేమం, మరోపక్క అభివృద్ధితో ముందుకు వెళుతోన్దన్నారు. పరిస్థితి ఇలా ఉంటే తెలుగుదేశం అభివృద్ధి లేదని దొంగ ప్రచారం చేస్తుందని విమర్శించారు. నెల్లూరు రూరల్ పరిధిలో లేఅవుట్లు వేసేవారు ఇకపై రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తేనే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

టీచర్స్ కాలనీలో చంద్రమౌళి, రొంపిచర్ల సుబ్బారెడ్డి, వెంకయ్య యాదవ్, కోటేశ్వర్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రమౌళి నగర్లో సన్నపురెడ్డి సుబ్బారెడ్డి, కరీముల్లా, గంగిరెడ్డి, ఎస్కే బాబు, రాజు, చిట్టిబాబు, రఫీ తదితరులు కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కార్పొరేటర్లు మూలే విజయభాస్కర్ రెడ్డి, సత్తార్, వైసీపీ నేతలు పాశం శ్రీనివాసులు, ఏసు నాయుడు, సుధీర్ రెడ్డి, సూరిబాబు, జీవన్ ప్రసాద్, హరిబాబు యాదవ్, మదన్మోహన్ రెడ్డి, రియాజ్,పాతపాటి పుల్లారెడ్డి, మేఘనాథ్ సింగ్, మొయిళ్ళ సురేష్ రెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, వైసీపీ మహిళా అధ్యక్షురాలు, కార్పొరేటర్ గౌరీ, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ పంపిణీ

Satyam NEWS

అమరావతిలో భూముల ధరలు పెరుగుతుంటే మేం చప్పట్లు కొట్టాలా?

Satyam NEWS

అనారోగ్యం తో బాధపడుతున్న నిరుపేద యువకుడికి తస్లీమా సాయం

Satyam NEWS

Leave a Comment