కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రం సమస్యల వలయంలో చిక్కుకుని ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావడం లేదని వారన్నారు. ఐదో వార్డులో డ్రైనేజ్, ముళ్ళ పొదలు, వివిధ సమస్యలను కాంగ్రెస్ పార్టీ టిపిసిసి కార్యనిర్వహణ కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రంగినేని జగదీశ్వర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తఫా, మాజీ సర్పంచ్ ఎత్తం కృష్ణ, మండల అధ్యక్షుడు పరశురాం,శీలం వెంకటేష్, మోజర్ల గోపాల్, డిష్ రవి, క్రాంతి తదితరులు నేడు పరిశీలించారు. కొల్లాపూర్ పట్టణంలో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించాలని పురపాలక కమిషనర్ వెంకటయ్య ను జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడారు.
previous post