బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని వారి ఆశయ సాధనకు ప్రతిఒక్కరం కంకణ బద్ధులవ్వాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలోని ఆయన విగ్రహానికి కార్యకర్తలతో కలిసి పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
కులం పేరుతో వర్ణం పేరుతో అన్ని రకాలుగా అణిచివేత కి గురైన వర్గాలకు అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మహిళ విద్యకు ఆద్యుడు, గొప్ప దార్శనికుడు జ్యోతిరావు పూలే అని జూపల్లి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.