39.2 C
Hyderabad
May 4, 2024 22: 23 PM
Slider హైదరాబాద్

సమస్యలు పట్టించుకోని రామాంతపూర్ కార్పొరేటర్

#ramanthapur

ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని రామంతపూర్ డివిజన్ లో అనేక ప్రధాన సమస్యలతో ప్రజలు సతమత మవుతున్న తరుణంలో కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు పట్టించుకోవడంలేదని, మాజీ కార్పొరేటర్ గంధం జోష్న నాగేశ్వరరావు ఆరోపించారు.

గురువారం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ సమస్యలపై అవగాహన లేని కార్పోరేటర్ వల్ల వరద నీటి సమస్య ఏర్పడిందని, సమస్యలను పరిష్కరించడంలో కార్పొరేటర్ ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. గత ఏడాది, బుధవారం కురిసిన వర్షానికి శంకర్ నగర్ కాలనీ ముంపుకు గురి అయిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా కార్పొరేటర్ పట్టించుకోవడంలేదని గంధం జోష్ణ విమర్శించారు.

మంత్రి కే టీ ఆర్, మేయర్ విజయలక్ష్మి రామంతపూర్ డివిజన్ ను ఊహించని విధంగా అభివృద్ధి చేస్తే చేతగాని బీజేపీ కార్పొరేటర్ టిఆర్ఎస్ నాయకులను నిందించటం తగదని, టిఆర్ఎస్ నాయకుల పై లేనిపోని నిందారోపణలు చేస్తే తే సహించేది లేదని గంధం జోష్నా నాగేశ్వరరావు హెచ్చరించారు.

తాను కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఐదు కోట్ల పనులను ప్రతిపాదించి నాలుగు కోట్ల మేరకు పనులు పూర్తి చేశానని, ప్రతిపాదనలు సాంక్షన్ అయి ఇంకా మిగిలిన పనులను పూర్తి చేయించ లేని కార్పొరేటర్ టిఆర్ఎస్ పై దుమ్మెత్తి పోయడం దురదృష్ట కరమన్నారు.

ఏడాదిన్నర కాలంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమౌతున్నారని, సమస్యలపై దృష్టి సారించనీ కార్పొరేటర్ కు తగిన సమయంలో బుద్ధి చెబుతారని ఆమె పేర్కొన్నారు.

ఒక్క పైసా కూడా నిధులు మంజూరు చేయలేదని కార్పొరేటర్ టిఆర్ఎస్ నాయకులు చేసే శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు హాజరై ఫోజులు కొట్టడం మామూలైపోయింది అని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా బస్తీ లను సుందరంగా తయారుచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోసే హక్కు కార్పొరేటర్ కు ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు.

Related posts

కొత్త ఏడాదిలో గ్యాస్ ధరలపై కేంద్రం షాక్

Sub Editor

కైండ్ నెస్: బైంస బాధితులకు సేవా సమితి వితరణ

Satyam NEWS

అమ్మానాన్నలను వేధిస్తున్నాడని తమ్ముడి హత్య

Satyam NEWS

Leave a Comment