33.2 C
Hyderabad
May 15, 2024 21: 36 PM
Slider నిజామాబాద్

ఆన్లైన్ ట్రేడింగ్ గొడవ.. ఇద్దరు కిడ్నాప్

#kamareddy

తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు

ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఓ వ్యక్తి కోటి రూపాయల వరకు వసూలు చేసి పత్తా లేకుండా పారిపోయాడు. పారిపోయిన వ్యక్తి రూములో ఉన్న మరో ఇద్దరిని అతని ఆచూకీ చెప్పాలని ట్రేడింగ్ లో మోసపోయిన బాధితులు కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టారు. చివరికి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు.

ఈ ఘటన కామారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో కలకలం సృష్టించింది. కిడ్నాప్ బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డికి చెందిన లుక్మాన్ అనే యువకుడు హైదరాబాదులోని అత్తాపూర్ లో నివాసం ఉంటూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. అలాగే లుక్మాన్ తో పాటు కామారెడ్డికి చెందిన మరో ఇద్దరు స్నేహితులైన సయ్యద్ జావిద్, సుమేర్ లు  సైతం లుక్మాన్ తో పాటు ఒకే రూంలో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్నారు.

లుక్మాన్ గత నెల 20వ తేదీన ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో కొంతమంది వద్ద డబ్బులు వసూలు చేసుకుని పారిపోయాడు. గత నెల 25వ తేదీన లుక్మాన్ తనతో పాటు రూంలో ఉంటున్న జావిద్ కు ఫోన్ చేసి తాను ముంబైలో ఉన్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని సయ్యద్ జావిద్ గుడిమల్కాపూర్ పోలీసులకు, లుక్మాన్ తండ్రికి సైతం సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అవేజు, అమీర్, షా నవాజులు హైదరాబాదులో ఉంటున్న సయ్యద్ జావిద్ తో పాటు మరో స్నేహితుడైన సుమేర్ లను శుక్రవారం సాయంత్రం కిడ్నాప్ చేసి కామారెడ్డికి తీసుకువచ్చారు.

లుక్మాన్ ఎక్కడ ఉన్నాడో విషయాన్ని తమకు చెప్పకుండా పోలీసులకు, అతని తండ్రికి ఎందుకు చెప్పారంటూ సయ్యద్ జావిద్, సుమేర్లను తీవ్రంగా చితకబాదుతు వేధించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పొందుర్తి గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో జావిద్, సుమేర్ లను ఉంచి లుక్మాన్ ఎక్కడున్నాడో చెప్పాలంటూ తీవ్రంగా వేధించారు. రెండు రోజుల పాటు జావీద్, సుమీర్లను వేధించిన కామారెడ్డి జిల్లా కేంద్ర చెందిన ముగ్గురు ఆదివారం సాయంత్రం జావిద్, సుమేర్ లను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో గల ఓ దాబా వద్ద వదిలేసి పారిపోయారు.

ఇది గమనించిన జావిద్ బంధువులకు కిడ్నాప్ చేసిన అవేజు, అమీర్, షా నవాజుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం జావిద్, సుమేర్ లు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

దాబా వద్ద సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు

Related posts

ఉత్తరాంధ్ర ప్రజలు మోదీ పర్యటన విజయవంతం చేయాలి

Bhavani

తెలంగాణ పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసులు

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ కు రాజధాని వచ్చేసిందోచ్

Satyam NEWS

Leave a Comment