37.2 C
Hyderabad
May 2, 2024 11: 40 AM
Slider విశాఖపట్నం

ఉత్తరాంధ్ర ప్రజలు మోదీ పర్యటన విజయవంతం చేయాలి

ఉత్తరాంధ్ర ప్రజలు మోదీ పర్యటన విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కోరారు. ఈనెల 11, 12 తేదీల్లో ప్రధాని మోది పర్యటన ఉంటుంది. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్ కార్యాలయ శంకుస్థాపన తో బాటు 15 పథకాల ప్రారంభం కూడా ఉంటుంది. అదే విధంగా రాయపూర్ హైవే విస్తరణ, ఆరు లైన్ల జాతీయ రహదారి జాతికి అంకితం, ఎస్ఐ ఆస్పత్రి, ఐఐఎమ్, హెచ్ పి సి ఎల్ విస్తరణ ప్రారంభం వంటి భారీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అదే విధంగా 12 వతేదీన మోదీ కి పౌర స్వాగతం. ఉంటుంది. వైకాపా ప్రభుత్వం ప్రధాని మోదీ పర్యటనను వాళ్ల పార్టీ కార్యకలాపాలతో కలగాపులగం చేస్తున్నారని మాధవ్ అన్నారు. గతంలో అల్లూరి శత జయంతిని ఇలాగే ఖరాబు చేశారని ఆయన అన్నారు.

విశాఖలో ఇప్పటికే పాలన భ్రష్టు పట్టించారు. భూ కబ్జాలు పెరిగిపోయాయి. విపక్షాల అణచివేత చట్ట విరుద్ధంగా గుతోంది. వీటిని ఖండిస్తున్నాము అని ఆయన అన్నారు. జన సేన నేత పవన్ కల్యాణ్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కోర్టు మొట్టికాయలు వేసినా తీరు‌మార్చుకోలేదు. పవన్ కల్యాణ్ మీద రెక్కీ దారుణం. ఆయనకు సెక్యూరిటీ పెంచాలి. దితులను గుర్తించి చర్యలు తీసుకోవాలి అని మాధవ్ తెలిపారు. ఇపుడు మళ్లీ అయ్యన్న పాత్రుడిని వేధించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిన పోలీసులే తాళాలు పగలగొట్టి, గోడలు దూకీ వెళ్లటం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ 11 రాత్రి విశాఖ చేరుకుంటారు. 12 న రోడ్ షో, సభ ఉంటాయి. సోము వీర్రాజు నేతృత్వాన ఏర్పాట్లు చేస్తాం అని మాధవ్ తెలిపారు.

Related posts

చెప్పిన పంటలు సాగు చేయకపోతే రైతుబంధు ఇవ్వరా?

Satyam NEWS

కేంద్రం తీరుపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

Satyam NEWS

సమత అత్యాచారం కేసులో ఎదురుతిరిగిన నిందితులు

Satyam NEWS

Leave a Comment