దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సి) తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సుమోటో కేసుగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసులు పంపింది.
ఎన్‌కౌంటర్‌పై నిజానిజాలు తెలుసుకునేందుకు వెంటనే ఘటనాస్థలికి ఒక దర్యాప్తు బృందాన్ని పంపాలని సంస్థ డైరెక్టర్ జనరల్(ఇన్వెస్టిగేషన్)ను ఆదేశించింది. ఘటనాస్థలాన్ని జాగ్రత్తగా పరిశీలించి వెంటనే నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో ఎస్‌ఎస్‌పి నేతృత్వంలోని ఒక దర్యాప్తు బృందం హైదరాబాద్ బయలుదేరినట్లు తెలుస్తోంది.
ఈ ఎన్‌కౌంటర్ ఘటనకు పోలీసులు ముందుగానే ఏర్పాట్లు చేసుకొని సిద్ధమయ్యారన్న దానికి ఎటువంటి ఆధారాలు కనిపించడం లేదని ఎన్‌హెచ్‌ఆర్‌సి ఈ సందర్భంగా అభిప్రాయ పడింది.