30.7 C
Hyderabad
May 5, 2024 06: 22 AM
Slider పశ్చిమగోదావరి

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి

#eluru

పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. ఇండియన్ స్వచ్చత లీగ్ ఆధ్వర్యంలో  స్వచ్ఛత హే సేవ కార్యక్రమం పై నగరపాలక సిబ్బంది, విద్యార్థులతో  నిర్వహించిన అవగాహనా ర్యాలీ ని   స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుండి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమీషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ అపరిశుభ్రత కారణంగా రోగాలు వ్యాప్తి చెందుతాయని,  ప్రతీ వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించినప్పుడే రోగాలు దరిచేరవన్నారు.  వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య పరిస్థితుల పై ప్రజలకు మరింత అవగాహన కలిగించేందుకు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ లలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ Dr. మాలతి , DE,  AEలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డ్ పర్యావరణ కార్యదర్శులు, నగరపాలక సంస్థ సిబ్బంది,  యువతీ, యువకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

భూ కబ్జా అడ్డుకున్న టీడీపీ నేతలపై వైసీపీ దాడి

Satyam NEWS

కల్వకుర్తిలో వైభవంగా బతుకమ్మ సంబరాలు

Satyam NEWS

“టాప్ గేర్” సినిమాతో ఆది కేరీర్ బ్రేకులు లేకుండా సాగాలి

Satyam NEWS

Leave a Comment