28.7 C
Hyderabad
April 26, 2024 07: 49 AM
Slider గుంటూరు

సంక్షేమ పథకాల కారణంగా ఆత్మగౌరవంతో జీవనం

#ambati

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాల వారు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 13వ సచివాలయం పరిధిలో 14 వ వార్డులో 222 గృహాలను ఆయన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన కరపత్రాలను అందించారు.

ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా 13వ సచివాలయం పరిధిలో రూ. 10.63 కోట్ల సంక్షేమ సాయం అందిందన్నారు. వీటిలో సంక్షేమ పథకాలనకు రూ.7.08 కోట్లు,అభివృద్ధి పనులకు రూ.3.55. కోట్లు మంజూరయ్యాయని మంత్రి అంబటి వివరించారు. రైతు భరోసా ద్వారా 263 మందికి రూ.85.72 లక్షలు,అమ్మఒడి ద్వారా 312 మందికి రూ. 74.55 కోట్లు, వైఎస్ఆర్ చేయూత ద్వారా 167మందికి రూ. 53.43 లక్షలు,జగనన్న తోడు ద్వారా 37 మందికి రూ. 3.7 లక్షలు, వైఎస్ఆర్ ఆసరా ద్వారా 366 మందికి రూ.55.31 కోట్లు, డ్వాక్రా సున్నా వడ్డీ రుణాల ద్వారా 392 మందికి రూ.10.34 లక్షలు,కాపు నేస్తం ద్వారా 31 మందికి 7.8 లక్షలు,  వాహన మిత్ర ద్వారా 10 మందికి రూ.1.9 లక్షలు,విద్యా దీవెన ద్వారా 300 మందికి రూ.81.11 లక్షలు, వసతి దీవెన ద్వారా 174 మందికి రూ.21.93 లక్షలు,  వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 413 మందికి 2.76 కోట్లు, సంక్షేమ సాయం అందింది. వైఎస్ఆర్ ఈబీసీ ద్వారా 29 మందికి 4.35 లక్షలు,జగనన్నచేదోడు ద్వారా 21 మందికి 3.1లక్షలు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 8 కి 1.05 లక్షలు ,వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా 17 మందికి 1.40 లక్షలు,డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా 38 మందికి 14.32 లక్షలు, వైఎస్ఆర్ భీమా ద్వారా 8 మందికి 12.60 లక్షలు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు(రైతులకు) 43 మందికి 1.42 లక్షలు,పాస్టర్ లకు గౌరవ వేతనం ద్వారా ఒకరికి ఏడాదికి 60 వేలు అందించామన్నారు.

రూ . 3.55  కోట్లతో శాశ్వత వనరుల కల్పన

నాడు నేడు పథకం మొదటి విడత ద్వారా స్కూల్ అభివృద్ధికి రూ.70 లక్షలు, 14 వ ఆర్ధిక సంవత్సరంలో నీటి పైపు లైన్ పనులకు గాను 76.9 లక్షలు పనులు , 15 వ ఆర్ధిక సంవత్సరంలో CC రోడ్లు నిర్మాణ పనులకు గాను 13.56 లక్షలు పనులు, సాధారణ నిధులు నుంచీ సిసి డ్రైన్స్ నిర్మాణంకు గాను రూ. 3.9 లక్షలు పనులు

,సాధారణ నిధులు  నుంచీ CC రోడ్లు కొరకు రూ. 9.09 లక్షల పనులు,సాధారణ నిధులు  నుంచీ సిసి రోడ్లు & సిసి డ్రైన్స్ నిర్మాణంకు కొరకు రూ. 7.55 లక్షల పనులు చేయడం జరిగిందన్నారు. నాడు నేడు పథకం ద్వారా రెండో విడతలో రూ.1.74 కోట్లు మంజూరయ్యాయి, పనులు జరుగుతున్నాయని తెలిపారు. గడపగడపకు మన కార్యక్రమం పూర్తయితే ప్రభుత్వం ప్రతి సచివాలయానికి 20 లక్షల గ్రాంట్ విడుదల చేస్తుందని వీటితో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్  నాయకులు చల్లంచర్ల సాంబశివరావు,  మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ గీత హసంతి, వైస్ చైర్మన్ షేక్ నాగూర్ మీరాన్, స్థానిక కౌన్సిలర్ గడ్డం శ్రీలత, అచ్యుత శివప్రసాద్, కమిషనర్ కొలిమి షమ్మీ ,గడ్డం వెంకటేశ్వర్లు, బండి మల్లికార్జున రెడ్డి,రావిక్రింది వెంకట మల్లిఖార్జున రావు, ఇతర ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, మునిసిపల్ అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ఉన్నారు

Related posts

తుచ్ఛమైన చర్య: షింజో అబె దారుణ హత్య

Satyam NEWS

గొత్తికోయ కుటుంబానికి తస్లీమా అండ

Satyam NEWS

శ్రీ రేణుక మాత ఎల్లమ్మ మొదటి వార్షికోత్సవం

Satyam NEWS

Leave a Comment