28.7 C
Hyderabad
May 6, 2024 02: 13 AM
Slider ఖమ్మం

సీఎం కప్ పోటీలు ప్రారంభం

#CM Cup competition

సీఎం కప్- 2023 పోటీల్లో భాగంగా మునిసిపల్ పరిధిలో నిర్వహించనున్న క్రీడా పోటీలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖో-ఖో, కబడ్డీ, అథ్లెటిక్స్, వాలీ బాల్, ఫుట్ బాల్ క్రీడలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం ను అన్ని హంగులతో, క్రీడాకారులకు సకల వసతులు, సౌకర్యాలతో తీర్చిదిద్దామన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు, మానసిక ఉల్లాసం కలిగి, ఫిజికల్ ఫిట్నెస్ చేకూరుతుందన్నారు. జిల్లాలో వేసవి క్రీడా శిబిరాల్లో 6 వేల పైచిలుకు పిల్లలు నమోదు చేసుకున్నారని, అందులో 50 శాతానికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నవారేనని, అందరూ క్రీడా పోటీల్లో పాల్గొనాలని, ప్రతిభను చాటాలని అన్నారు.

తీవ్ర ఎండల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని, ఉ. 6 నుండి 9 గంటల వరకు, సా. 5 నుండి 7 గంటల వరకు పోటీలు నిర్వహించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటుతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, సీఎం కప్-2023 ని మునిసిపల్, మండల స్థాయిల్లో ప్రారంభించినట్లు 5 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మండల, మునిసిపల్ స్థాయిల్లో ప్రతిభ కనపరచిన వారికి జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారని, జిల్లా స్థాయిలో 11 విభాగాల్లో పోటీలు వుంటాయని, జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరచిన వారికి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారని, రాష్ట్ర స్థాయిలో 18 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారని తెలిపారు.

15 నుండి 36 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఎడి పోటీల్లో పాల్గొనవచ్చని ఆయన అన్నారు. గ్రామాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఈ పోటీలను సద్వినియోగం తమ ప్రతిభను చాటాలన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా ఎదుగుటకు ఈ పోటీలు మంచి వేదిక అవుతాయని ఆయన తెలిపారు.

Related posts

అమ్మ సమాధి అదే పెళ్లివేదిక

Satyam NEWS

పొల్యూషన్: విషవాయువులు పీల్చి 6 గురి మృతి

Satyam NEWS

శ్రీ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలు ఆరంభం

Satyam NEWS

Leave a Comment