26.7 C
Hyderabad
May 3, 2024 09: 27 AM
Slider ఖమ్మం

అక్కడికక్కడే సమస్యల పరిష్కారం

#Puvwada Ajay

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవటం, వాటిని అక్కడికక్కడే పరిష్కరించెందుకు ప్రయత్నం జరుగున్నది. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా అధికారులతో కలిసి ఖమ్మం నగరంలో సైకల్ పై పర్యటించారు. జిల్లా కలెక్టర్ తో పాటు, ఉన్నతాధికారులంతా పాల్గొన్న ఈ కార్యక్రమం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం దొరికింది.

వాడ వాడ పువ్వాడ పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమంకు ప్రజలనుంచి మంచి స్పందన వస్తున్నది. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని అందంగా తీర్చిదిద్దెందుకు ప్రయత్నించి సఫలం చెందామన్నారు. రాష్ట్రంలోనే ఖమ్మంను టూరిజం హబ్ గా మారుస్తున్నామన్నారు. ఖమ్మం అభివృద్దిని చూసేందుకు ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు రావటం గర్వకారణమన్నారు.

అభివృద్ది పనుల పరిశీలన, ప్రజలు వివరించిన సమస్యలను తక్షణమే పరిష్కారించాలని అధికారులకు ఆదేశాలు. ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా చేపట్టిన అనేక పనులు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అధికారులతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 3వ టౌన్ ఏరియా లో గొల్లపాడు చానల్ ఆధునీకరణకు అనేక మంది ప్రశంసలు అందుతున్నాయన్నారు.

గత నాలుగు సంవత్సరాలలో ప్రజలకు సరైన రీతిలో మౌళిక వసతులు అందుతున్నాయని, అందుకు ప్రణాళికబద్దంగా పనిచేస్తున్నామని వివరించారు. వాడ వాడ పువ్వాడ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నామన్నారు. ముఖ్యంగా నగరంలో త్రాగునీటి సమస్యను పూర్తిగా అధిగమించామని స్పష్టం చేశారు. చెత్త సేకరణ అద్భుతంగా జరుగుతుందని, గతంతో పోల్చితే నేడు రోడ్ల మీద చెత్త లేకుండా ట్రాక్టర్ లు, మిని వ్యాన్ ల ద్వారా నిర్విరామంగా చెత్త సేకరణ జరుగుతుందన్నారు.

మురుగు సమస్యను సైతం పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతోనే డివిజన్ కు రూ.40 లక్షలు కేవలం డ్రైన్స్ నిర్మాణం కోసమే కేటాయించామని అన్నారు. ప్రస్తుతం నిర్మించిన గోళ్ళపాడు ఛానల్ అండర్ గ్రౌండ్ మాదిరిగానే త్వరలో అండర్ డ్రైనేజ్ నిర్మాణ౦ చేయాలని తలచామని, ఆయా పనులకు పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ అతి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.

Related posts

ఆకట్టుకున్న టీ ఎన్ జీ ఓ మహిళ ఉద్యోగుల ఆటపాటలు

Murali Krishna

గాంధీ నుంచి పరారైన కోవిడ్ పాజిటివ్ ఖైదీలు

Satyam NEWS

హైదరాబాద్‌కు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు కదిలాయి

Sub Editor

Leave a Comment