36.2 C
Hyderabad
May 12, 2024 19: 02 PM
Slider చిత్తూరు

నిరసనలు, అరెస్టుల మధ్య CM జగన్ చిత్తూరు పర్యటన

#Minister Jagan

ముఖ్యమంత్రి జగన్ చిత్తూరు పర్యటన మంగళవారం నిరసనలు, అరెస్టుల మధ్య సాగింది. జగన్ గో బ్యాక్ అంటూ తెలుగు యువత, TNSF, CPI, CPM నాయకులు జగన్ పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. వారిని ముందస్తు పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు పర్యటన సందర్భంగా తెలుగు యువత చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు కాజురురాజేష్, చిత్తూరు నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రభు తేజ ఆధ్వర్యంలో తెలుగు యువత మరియు టిఎన్ఎస్ఎస్ అడ్డుకోవడం జరిగింది. గో బ్యాక్ అనే సీఎం నినాదంతో నిరసన చేయడం జరిగినది.

రాష్ట్రంలోని యువతని రెండు లక్షల ముప్పై ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి యువతని నిలువునా గొంతు కోయడం జరిగిందనీ, అదేవిధంగా యువతకు డ్రగ్స్ కు బానిస చేసిన ముఖ్యమంత్రి ఈరోజు చిత్తూరు పర్యటనకు ఏ మొహం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. దీంతో తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు యువత చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు కాజూరు రాజేష్, రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ ఆర్గనైజర్ సెక్రెటరీ ముత్తు ప్రసాద్, టిఎన్ఎస్ఎఫ్ చిత్తూరు నియోజకవర్గం అధ్యక్షుడు ప్రభుతేజ పాల్గొన్నారు. అదేవిధంగా సోమవారం అర్ధరాత్రి TDP నాయకుల ఇంటి దగ్గరికి వెళ్లి అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్ కు తీసుకువచ్చారు. చిత్తూరు నగర తెలుగు యువత ఉపాధ్యక్షుడు యువరాజ్, డివిజన్ ఇంచార్జ్ గౌతమ్ కుమార్, మౌళి , గౌస్, బాలాజీ, రోహిత్, భరత్ కన్నా, సివి లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

చిత్తూరు జిల్లా కు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం నిరసన కార్యక్రమం చేపట్టడానికి చిత్తూరు మహాత్మ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి యస్. నాగరాజు, సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ .గంగరాజులను ముందస్తుగా టూ టౌన్ ఎస్ఐ నాగరాజు అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్టు చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లిన తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు, సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిని, ప్రజల పక్షాన పోరాటాలు చేసే ఉద్యమకారులను అరెస్ట్ చేస్తే ఉద్యమాలు ఆగవు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయ డైరీలో జరిగిన అవకతవకులపై, చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Related posts

కలవరం కలిగిస్తున్న కరోనా భారతం

Satyam NEWS

వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన ఆహారం అందించాలి

Murali Krishna

జాతీయ రహదారిపై కార్లు ఢీ కొని ముగ్గురు మృతి

Satyam NEWS

Leave a Comment