33.2 C
Hyderabad
May 3, 2024 23: 34 PM
Slider ముఖ్యంశాలు

బీఆర్ఎస్ వి మధ్యయుగపు కాలంనాటి ఆలోచనలు

#BRS v Medieval

తెలంగాణ పునర్నిర్మాణం అంటే గడీల సంస్కృత అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు మూడు నెలల నుండే జిల్లా మండల కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగిందని తెలిపారు.

జిల్లా పోలీస్ యంత్రంగానికి కూడా తెలుసని అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారని అన్నారు. అయినా ప్రజా అభిమానం ముందు వారి ప్రయత్నాలు విఫలం చెంది తండోప తండాలుగా ప్రజలు హాజరై సభను విజయవంతం చేశారని అన్నారు.

నేడు రాష్ట్రంలో మధ్యయుగపు కాలంనాటి సంస్క్రుతి కనిపిస్తుందని తెలంగాణ ను పునర్నిర్మానం చేస్తున్నాము అంటూ హైదరాబాద్ రాష్ట్రంలో చూసిన నిజం నిరంకుశ పాలన తిరిగి కొనసాగిస్తున్నారని విమర్శించారు.దీనినే పునర్నిర్మాణం అనే భావనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.

వందల ఎకరాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గడీల తరహా ఫామ్ హౌస్ లను కట్టి భూ దందాలు సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కృష్ణ గోదారి జలాల నుండి ఒక ఆయకట్టుకు నీరు అందించిన పాపాన పోలేదని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు పై కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

కాలేశ్వరం ద్వారా అదనంగా ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా కాలేశ్వరం కింద బ్రాంచ్ కెనాల్, పంట కాలవలు తీశారా, బ్రాంచ్ కెనాల్స్ డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్ లేకుండా ఎక్కడ ఏ గ్రామానికి నీరు ఇచ్చారు అప్పనంగా అడ్డంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రచార ఆర్పాటాలతో 45 లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

కాగ్ కూడా కాలేశ్వరం ప్రాజెక్టు విధానాలను తప్పు పట్టిందని అన్నారు. ఒక్క ఎకరానికి నీరు ఇవ్వకుండా 80 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారని అన్నారు. ఏ నీళ్ళ కోసం అయితే రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ నీళ్లు రాకుండా చేస్తున్నారని దూషించారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి ప్రజలకు అందించాల్సిన అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని అన్నారు. రాహుల్ గాంధీ విమర్శించిన విధంగా బిజెపికి బీఆర్ఎస్ పార్టీ బీ టిం అనే మాట వాస్తవం అని అన్నారు.

పాట్నాలో జరిగిన బిజెపి వ్యతిరేక పార్టీల కూటమిలో అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారని హైదరాబాదులో అదే అఖిలేష్ యాదవ్ తో కెసిఆర్ రహస్య మంతనాలు జరుపుతున్నారని, బిజెపికి వ్యతిరేకంగా ఐక్యమవుతున్న కూటమి పక్షాలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని తద్వారా భారతీయ జనతా పార్టీ మేలు చేయడానికి బీఆర్ఎస్ కృషి చేస్తుందని తెలిపారు.

Related posts

గుణదల మేరిమాత తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

కొట్టుకు పోవడానికి సిద్ధంగా ఉన్న పెద్ద దేవాడ తాత్కాలిక రోడ్డు

Satyam NEWS

గోవా లో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత

Satyam NEWS

Leave a Comment