30.7 C
Hyderabad
May 5, 2024 05: 43 AM
Slider తెలంగాణ

త్రీ కార్డ్ ప్లే: అన్నా ఒక తమ్ముడు మధ్యలో కేసీఆర్

kcr fire on vivek

జి.వెంకటస్వామి కుమారుడు వివేక్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ పగబట్టారా? నిజంగా ఆయనను అన్ని రకాలుగా అణగదొక్కాలని ప్లాన్ చేశారా? సీఎం కేసీఆర్ రాజకీయంగా తన గొంతు కోయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ ఆరోపించడం వెనుక కారణం ఏమిటి? వివేక్ కేసీఆర్ కు చేసిన ద్రోహం ఏమిటి?

కాంగ్రెస్ పార్టీ లో ఉండే వివేక్ ను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి రాజకీయ సలహాదారుడిగా కేసీఆర్ మంచి హోదా ఇచ్చారు. కేసీఆర్ తో మాజీ ఎంపీ వివేక్ కు మంచి సంబంధాలే ఉండేవి. అయితే పెద్దపల్లి పార్లమెంట్ సీట్ ను ఆశించిన వివేక్ కు కేసీఆర్ మొండి చేయి చూపడం తో ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి.

వివేక్ కు ఎంపీ సీట్ నిరాకరించిన కేసీఆర్, వివేక్ సోదరుడు వినోద్ కు చెన్నూరు అసెంబ్లీ సీటు కూడా ఇవ్వలేదు. దాంతో అయన పార్టీని వీడి వెళ్లి బీజేపీ లో చేరారు. వివేక్ ఎన్నికలకు ముందే ప్లాన్ చేసుకుని ఒక టివి ఛానెల్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల ముందు ఒక పత్రిక కూడా పెట్టాడు. ఛానెల్ లో పత్రికలో కేసీఆర్ కు బాకా ఊదుతూ పుంఖాను పుంఖాలుగా రాసేవాడు.

అయితే టిక్కెట్ నిరాకరించిన నాటి నుంచి ఆ పత్రిక, ఆ ఛానెల్ తీరు మారాయి. కేసీఆర్ ను పొగడటం నిలిపివేశాయి. దాంతో ఇద్దరి మధ్య మరింత అగ్గి రాజుకుంది. రాజకీయ పోరాటం కాస్తా వ్యాపార పోరాటంగా మారిపోయింది. వివేక్ తన వ్యాపారాలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు.

మీడియాలో ఒక ఛానెల్ నుంచి మరొక ఛానెల్ కు లేదా ఒక పత్రిక నుంచి మరొక పత్రికకు జర్నలిస్టులు మారడం సహజమే అయితే కేసీఆర్ బినామీ తో ఒక ఛానెల్ కొనిపించి తన ఛానెల్ నుంచి జర్నలిస్టులను తీసుకెళ్లే ప్లాన్ చేశాడని వివేక్ అనుకోవడం మొదలు పెట్టాడు. అలాగే పత్రిక విషయంలో కూడా జరిగింది. వివేక్ ఛానెల్ లో ఉన్న వారు చెప్పిన మాటలు విని ఆయన తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టాడు. ఫలితంగా దాని ప్రభావం మరిన్ని వ్యాపారాలపై పడటం మొదలు పెట్టింది. పత్రిక నష్టాల్లోకి వెళ్లిపోయింది.

ఛానెల్ కు ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇతర వ్యాపారాలు కూడా దెబ్బతినడం ప్రారంభమైంది. వీటన్నింటికి కేసీఆర్ కారణమని వివేక్ అనుకున్నాడు. పత్రిక ఛానెల్ పెట్టి తెలంగాణ లో ఒక మహత్తర శక్తిగా మారిపోదామని వివేక్ వేసుకున్న ప్లాన్ పై కేసీఆర్ కు చాలా మంది ఉప్పందించారు. అటు వ్యాపారపరంగా నష్టపోతున్న వివేక్ కు కుటుంబం లో సోదరుడు వినోద్ తో కూడా పంచాయితీ పెట్టినట్లు తెలుస్తుంది.

ఈ మేరకు తన సోదరుని తో ఉంటే తనకు ఇబ్బందులు తప్పవని గ్రహించిన వినోద్ ఇటీవల పార్టీ మారి కాంగ్రెసులోకి వెళ్లారు. దీని తో కినుక వహించిన వివేక్ సీఎం కేసీఆర్ తన గొంతు కోయడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే తమ అన్నను కాంగ్రెస్‌లోకి వెళ్లేలా చేశారన్నారు.

బెల్లంపల్లిలో బీజేపీ గెలిచేలా ఉండటంతో ఈ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. తన అన్న కాంగ్రెస్‌లోకి వెళ్లడం ఆయన వ్యక్తిగతమని మాజీ ఎంపీ వివేక్ ఇప్పుడు అంటున్నారు. మొత్తానికి టిక్కెట్లు రాని అన్నదమ్ములు ఇద్దరూ కేసీఆర్ ను తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారు.

Related posts

ఇసుక అక్రమ రవాణా పాల్పడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే

Satyam NEWS

గుడ్ అరేంజ్మెంట్స్: మేడారం ఏర్పాట్లు భేష్

Satyam NEWS

11 కోట్ల ఆదాయం.. 15 కోట్ల ఖర్చు.. 40 కోట్ల అప్పు

Satyam NEWS

Leave a Comment