తన శరీరం చుట్టూ బాంబులు ఉన్నాయని, వాటిని ఏ క్షణమైనా పేల్చేస్తానని ఓ యువతి బెదిరించడంతో కోల్ కతా ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఏషియన్ విమానాన్ని అత్యవసరంగా కోల్‌కతాఎయిర్ పోర్ట్‌లోల్యాండ్ చేశారు. తన శరీరంలో బాంబు ఉందని, దానిని ఏ క్షణంలోనైనా పేల్చేస్తానని బెదిరించడంతో కంగుతిన్న ఫైలెట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.మోహిని మొండల్ (25) అనే యువతి శనివారం రాత్రి ఎయిర్ ఏషియన్ విమానంలో కోల్‌కతా నుంచి ముంబై బయలు దేరింది.
మార్గమద్యలో కేబిన్ సిబ్బందికి ఒక ఉత్తరం ఇచ్చి అది ఫ్లైట్ కెప్టెన్‌కు అందివాల్సిందిగా కోరింది. తన శరీరం చుట్టూ ఉన్నాబాంబులను పేల్చేస్తానని లేఖలో హెచ్చరించింది. దీంతో భయపడ్డ పైలట్ పై అధికారులకు సమాచారం అందించి కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. అనంతరం మోహిని మెండల్‌ను ఎయిర్‌పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి బాంబులు లేకపోవడం తో శనివారం రాత్రి 11.46 గంటలకు తిరిగి పంపించారు.
కాగా, మోహిని శరీరంలో బాంబు లేదని, ఆమె ఎందుకు అలా బెదిరించిందో,ఆమె మానసిక పరిస్థితి ఏంటన్నది విచారణలో తేలుతుందని అధికారులు పేర్కొన్నారు.