జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అసభ్య వ్యాఖ్యలను నిరసిస్తూ వైకాపా, జనసేన వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీనితో ఇరువర్గాలు రాళ్లదాడికి ఉపక్రమించారు. దీనితో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకుంది.భానుగుడి సెంటర్‌లో జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టి ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అప్పటికే కొందరు జనసేన కార్యకర్తలు ద్వారంపూడి ఇంటి వద్దకు చేరుకోగా వారిపై వైకాపా వర్గీయులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. దాడిలో పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలోఅక్కడకు చేరుకున్న పోలీసులు కొందరు జనసేన నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డిని అరెస్టు చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.
previous post